చిన్న వయస్సులో జుట్టు ఎందుకు రాలిపోతుంది..? కారణాలు ఏంటంటే..?

-

ఈరోజుల్లో చాలామంది జుట్టు రాలిపోయి ఇబ్బంది పడుతున్నారు. చిన్నవయసులోనే జుట్టు చాలామందికి రాలిపోతోంది. దానికి కారణాలేంటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. వయసు పెరిగే కొద్దీ జుట్టు రాలిపోతూ ఉంటుంది. చిన్నవయసులో అది ఎక్కువగా జరుగుతుంది. దాని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. చిన్న వయసు వాళ్లలో జుట్టు ఎందుకు రాలిపోతుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. జుట్టు రాలిపోవడానికి కారణం ఒత్తిడి. అధిక ఒత్తిడి కార్టిసాల్ స్థాయిని పెంచుతుంది. జుట్టుకి నష్టాన్ని కలిగిస్తుంది. దీంతో జుట్టు రాలిపోతుంది.

అలాగే మీరు తీసుకునే డైట్ కూడా మీ జుట్టుపై ప్రభావం చూపిస్తుంది. ఈ రోజుల్లో ఎక్కువ జంక్ ఫుడ్ ని తీసుకుంటున్నారు దీని వలన ప్రోటీన్ బాగా తగ్గిపోతుంది. పిండి పదార్థాలు ఎక్కువగా తింటున్నారు. ఈ ఆహారం శరీరంలో మంటని కలిగిస్తుంది ఉష్ణోగ్రతని పెంచేస్తుంది. ఇలా జుట్టు రాలిపోతుంది. చిన్న వయసులో జుట్టు రాలిపోవడానికి ఇంకో కారణం స్కాల్ప్ సోరియాసిస్.

ఎక్కువగా చుండ్రు వంటి వ్యాధులు ఉన్నట్లయితే జుట్టు బాగా రాలిపోతుంది. ధూమపానం ఎక్కువగా చేస్తున్నట్లయితే కూడా జుట్టు బాగా రాలిపోయి పల్చగా మారిపోతుంది. మీ జీవన శైలిని జుట్టుపై ప్రభావం చూపిస్తుంది. ఏ సమయానికి నిద్రపోతారు, ఏ సమయానికి నిద్ర లేస్తారు, వ్యాయామం ఇవన్నీ కూడా జుట్టుపై ప్రభావం చూపిస్తాయి. కొన్ని రకాల మందులు ఉపయోగించడం వలన కూడా జుట్టు రాలిపోతుంది. కాబట్టి ఈ తప్పులు చేస్తున్నట్లయితే మానుకోండి లేదంటే జుట్టు బాగా రాలిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version