తులసి మొక్క హిందూ సాంప్రదాయంలో పవిత్రమైన స్థానాన్ని కలిగి ఉంది ఇది కేవలం మొక్క మాత్రమే కాదు ఆధ్యాత్మిక ఆరోగ్య దృష్ట్యా అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఒక దైవ స్వరూపం. శ్రావణమాసం అత్యంత పవిత్రమైన నెల ఈ మాసంలోనే తులసి చెట్టు కు ప్రత్యేకమైన పూజలు చేస్తారు. అయితే తులసి మొక్క ఎండిపోతే అది దేనికి సంకేతంగా భావిస్తారు? శ్రావణంలో తులసి మొక్కకు సంబంధించిన ఎలాంటి పనులు తప్పక చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం..
ప్రతిరోజు తులసి మొక్కను పూజించడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సుఖము, సౌఖ్యము సమృద్ధిగా ఉంటుందని హిందువులు నమ్ముతారు. అయితే కొన్నిసార్లు తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోవడం మనం చూస్తూ ఉంటాం. ఇది ఏదో ఒక సంకేతాన్ని తెలియజేస్తుంది అని హిందువులు భావిస్తారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసంలో అకస్మాత్తుగా తులసి చెట్టు ఎండిపోవడం అనేది అశుభానికి సంకేతం ఇది ఆ ఇంట్లోనే కొన్ని ప్రతికూల పరిస్థితులకు దారి తీయవచ్చు. అంటే ఇంట్లో అకస్మాత్తుగా ఏదైనా ఆర్థిక సంక్షోభం రావడం,చేతిలో డబ్బు నిలవకుండా ఖర్చు చేయడం కుటుంబ సభ్యుల ఆరోగ్యం లేక మానసిక స్థితి లో మార్పులు, ఇంట్లో వాళ్ళ మధ్య గొడవలు అశాంతి పెరిగే అవకాశం ఉంది.
తులసి చెట్టు ఎండి పోతే తప్పక చేయాల్సినవి : తులసి మొక్క ఎండిపోయినప్పుడు మొక్కను అలానే వదిలేయకూడదు ఎండిన తులసి చెట్టును ఇంట్లో ఉంచడం చేయకూడదు. ముందుగా ఎండిపోయిన తులసి చెట్టును తీసివేసి ఏదైనా నదిలో శుభ్రమైన నీటిలో నిమజ్జనం చేయాలి. లేదంటే దగ్గరలోని హిందూ దేవాలయంలో ధునిలో వేయాలి. అలా వేసేటప్పుడు ఆ తులసి చెట్టుకు నమస్కరించి క్షమాపణ చెప్పాలి.
ముఖ్యంగా శ్రావణమాసంలో తులసి చెట్టు కు శుక్రవారం లో దశమి,ఏకాదశి రోజుల్లో పూజ చేయడం జరుగుతుంది. పూజ చేసిన తర్వాత మొక్క ఎండిపోతె అదే రోజు లేదా మరుసటి రోజు కొత్త తులసి మొక్కను మనం నాటాలి. అలా నాటటం వలన ఇంట్లో శుభానికి చిహ్నంగా హిందువులు నమ్ముతారు. ఎండిన తెలిసి చెట్టు తొలగించేటప్పుడు దాని ఆకులు, కొమ్మలను సేకరించి, ఆకులను పూజలో వినియోగించాలి కొమ్మలను ఎండిన తర్వాత ధుని లో లేదా ఏదైనా ఔషధ ప్రయోజనాలకు ఉపయోగించవచ్చు.
శ్రావణ మాసంలో తులసి చెట్టు ఎండిపోవడం ఎటువంటి అనర్ధాలు జరగకుండా ఉండడానికి కొత్త తులసి మొక్క ను నాటడం, ఆ మొక్కను ఇంటికి దేవతా స్వరూపంగా కొలవడం, పూజ చేయడం వల్ల తిరిగి కోల్పోయిన ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందవచ్చని కొందరు నమ్ముతారు. మరి మీ ఇంట్లో తులసి చెట్టు ఎండిపోతే బాధపడకుండా, కొత్త మొక్కని నాటుకొని ఆనందాన్ని తిరిగి పొందండి.