పొడవైన మరియు దృఢమైన జుట్టు పొందాలంటే పోషకాలు ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్లు, మినరల్స్ ఉండే ఆహారాన్ని మీ డైట్ లో భాగంగా చేర్చుకోవాలి. ఇలా చేయడం వలన మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది దాంతో పాటుగా జుట్టు కూడా దృఢంగా మారుతుంది. కనుక ఈ ఆహార పదార్థాలను తప్పకుండా మీ డైట్ లో చేర్చుకోండి. గుడ్లులో ప్రోటీన్, బయోటిన్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన జుట్టు బలంగా మారుతుంది. అంతేకాక జుట్టు ఎదగడానికి కూడా ఇవి సహాయపడతాయి.
పాలకూరలో ఉండేటువంటి ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి జుట్టు ఎదుగుదలకు మరియు దృఢంగా మార్చేందుకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి పాలకూరను తప్పకుండా మీ డైట్ లో భాగంగా తీసుకోండి. చాలామంది మంచి ఆరోగ్యం కోసం నట్స్ ను తీసుకుంటారు. అయితే ఇవి జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో సహాయపడతాయి. ముఖ్యంగా బాదంపప్పు, వాల్నట్స్, అవిసె గింజలు జుట్టు ఆరోగ్యానికి ఎంతో అవసరం. వీటిలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు ఆరోగ్యానికి ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి.
క్యారెట్స్ లో కూడా బీటా కేరోటిన్ ఉంటుంది. కనుక విటమిన్ ఏ ను తీసుకోవాలనుకుంటే క్యారెట్స్ ను మీ డైట్ లో చేర్చుకోండి. ఈ విధంగా ఆరోగ్యకరమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలలో ఫిష్ కూడా ఒకటి. దీనిలో ప్రోటీన్ కూడా ఉంటుంది. ముఖ్యంగా సాల్మన్ ఫిష్ తీసుకోవడం వలన జుట్టు ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. దీంతో దృఢమైన మరియు పొడవైన జుట్టును మీరు సొంతం చేసుకోవచ్చు.