చర్మ సంరక్షణ: ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవాలా?

-

బయటకి వెళ్తున్నప్పుడు సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకోవాలని చెబుతుంటారు. బయటకెళ్ళిన ప్రతీ సారి ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవాలని చర్మ సంరక్షణ నిపుణులు నొక్కి వక్కాణిస్తుంటారు. సూర్యుని నుండి వచ్చే అతినీల లోహిత కిరణాలు చర్మం మీద పడి, చర్మానికి హాని కలిగిస్తాయి. దానివల్ల చర్మ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వాటి నుండి కాపాడడానికి సన్ స్క్రీన్ లోషన్ అప్లే చేసుకోవడం కంపల్సరీ. ఐతే బయటకి వెళ్తున్నప్పుడే కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకోవాలా అనేది చాలా మందికి కలిగే ప్రశ్న.

ఇంట్లోఖి సూర్యుడి కిరణాలు అంతగా రాలేవు కాబట్టి సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అని అనుకుంటారు. కానీ సూర్యుని నుండి వచ్చే అతినీల లోహిత కిరణాలు ఇళ్ళలోకి కూడా ప్రయాణం చేస్తాయని చాలా మందికి తెలియదు. అవును, సూర్య కిరణాలు ఇంటి తలుపుల్లో నుండి, కిటీకీల్లో నుండి వెంటిలేటర్ల నుండి వచ్చేస్తాయి. దానివల్ల కూడా చర్మానికి హాని కలుగుతుంది. అందుకే ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకోవడం మంచిదని చర్మ సంరక్షణ నిపుణులు సూచిస్తున్నారు.

అదే గాక ఇంట్లో ఉన్నప్పుడు స్మార్ట్ ఫోన్, ల్యాప్ ట్యాప్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల వాడడం జరుగుతుంది. వాటిని వాడడం వల్ల నీలికాంతి చర్మంపై పడుతుంది. ఆ నీలికాంతి చర్మానికి హాని చేస్తుంది. ఆ నీలికాంతి నుండి చర్మాన్ని, ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి సన్ స్క్రీన్ లోషన్ అవసరం. సన్ స్క్రీన్ కాకపోతే సీరమ్ క్రీమ్ అయినా బాగానే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version