బిజినెస్ ఐడియా: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలని ఇచ్చే ఈ వ్యాపారాలు చేస్తే అదిరే లాభాలని పొందొచ్చు..!

-

చాలా మంది రైతులు మంచిగా ఆదాయం పొందాలని అనుకుంటూ ఉంటారు. అయితే రైతులు ఇలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని పొందొచ్చు. అయితే మరి ఎలా తక్కువ పెట్టుబడి తో ఎక్కువ రాబడిని పొందొచ్చు అనే దాని గురించి చూద్దాం.

ఇక్కడున్న ఈ వ్యాపారాలను కనుక రైతులు మొదలు పెడితే ఖచ్చితంగా రాబడి వస్తుంది. పైగా వీటి వల్ల పెద్దగా ఇబ్బందులు ఉండవు. అలానే రిస్కు కూడా ఉండదు. ఎంతో సాఫీగా రైతులు ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టి మంచిగా డబ్బులు పొందడానికి అవుతుంది. అయితే మరి ఇక ఆలస్యం ఎందుకు ఆ బిజినెస్ ఐడియాస్ గురించి చూసేద్దాం.

కలబంద కల్టివేషన్:

కలబందను పండించి 40 నుంచి 50 వేల వరకూ పొందొచ్చు. ఒకసారి కలబందని నాటితే మూడేళ్ల పాటు బాగుంటుంది. మూడేళ్ళ వరకూ ఎలాంటి చింత ఉండదు. ఒక హెక్టారు భూమి మీద కలబందను పండిస్తే సంవత్సరానికి 9 నుండి 10 లక్షల రూపాయలు వస్తాయి.

ఆర్గానిక్ ఫర్టిలైజర్:

ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ని ఉపయోగిస్తున్నారు. దీనిని కూడా మీరు వ్యాపారంగా మొదలు పెట్టొచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని ఇస్తుంది. అలానే డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి మంచిగా ఈ వ్యాపారం సాగుతుంది.

ఫర్టిలైజర్స్ మరియు సీడ్స్:

చిన్న చిన్న ఊర్లలో ఇవి మనకి దొరకవు. చాలా మంది రైతులు పట్టణాలు వెళ్లి తెచ్చుకుంటూ వుంటారు. కనుక అలాంటి వ్యాపారాన్ని మీరు మీ ఊర్లో పెడితే అద్భుతంగా రాబడి వస్తుంది. ఇలా మీరు ఫర్టిలైజర్స్ మరియు సీడ్స్ ని అమ్మి మంచిగా డబ్బులు పొందొచ్చు. చూశారు కదా రైతులు ఏ విధంగా ఫాలో అవ్వడం వల్ల మంచి రాబడి వస్తుంది అనేది. మరి ఇలా అనుసరించి ఎక్కువగా లాభాలని పొందండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version