ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది వ్యాపారాలను చేయడానికి ఇష్ట పడుతున్నారు. మీరు కూడా ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారా దాని ద్వారా మంచిగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా మీ కోసం.
దీన్ని ఫాలో అవ్వడం వల్ల మంచిగా డబ్బులు వస్తాయి పైగా కేంద్ర ప్రభుత్వం సహాయం కూడా ఇస్తోంది. మరి ఆ బిజినెస్ ఐడియాస్ గురించి ఇప్పుడు చూద్దాం, ప్రధానమంత్రి ముద్ర యోజన క్రెడిట్ గ్యారెంటీ ట్రస్ట్ ఫండ్, జెడ్ సర్టిఫికేట్ స్కీమ్ కింద MSMEలకు లోన్ అసిస్టెన్స్ కల్పిస్తోంది. దీనితో మంచిగా డబ్బులు వస్తాయి పైగా పెట్టుబడి గురించి మీరు ఆలోచించక్కర్లేదు. ఇక వ్యాపారాలు గురించి చూస్తే..
అప్పడాల వ్యాపారం:
ఈ బిజినెస్ ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం సహాయం కూడా ఇస్తోంది. కనుక మీరు ఈ బిజినెస్ ని మొదలు పెట్టొచ్చు దీని కోసం మీరు ఎక్కువ ఖర్చు కూడా చేయక్కర్లేదు. ముందు తక్కువ అమౌంట్ తో బిజినెస్ మొదలు పెట్టి ఆ తర్వాత మీరు విస్తరించుకోవచ్చు. అప్పడాల వ్యాపారం కోసం మిషన్ ని కొనుగోలు చేయవచ్చు లేదంటే మీరు చేతితో చేసుకోవచ్చు. ఒకవేళ మిషన్ ను కొనుగోలు చేయగలిగితే ఎక్కువ అప్పడాలు తయారు చేసి మీ యూనిట్ ని విస్తరించుకోవడానికి అవుతుంది. అలానే అప్పడాలు తయారు చేయడానికి కొన్ని సామాన్లు అవసరమవుతాయి. ఇలా కావలసిన సామాన్లని మీరు ఒకసారి కొని తర్వాత బిజినెస్ ని మొదలు పెట్టొచ్చు.
మసాలా పొడులు బిజినెస్:
దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం ఇస్తోంది. మసాలా పొడులతో మీరు మంచిగా మీ వ్యాపారాన్ని మొదలు పెట్టొచ్చు. మసాలా దినుసులును ప్రతి ఒక్కరు కూడా వంటల్లో ఉపయోగిస్తుంటారు కాబట్టి మంచిగా రన్ అవుతుంది దీనికి కూడా మీరు కావాలనుకుంటే మిషన్ కొనుగోలు చేయవచ్చు. అలానే కావాల్సిన మసాలా దినుసులు కొనుగోలు చేయాలి. ఇలా మీరు కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఈ వ్యాపారాలను మొదలు పెట్టి మంచిగా డబ్బులు పొందొచ్చు. ఎలాంటి రిస్క్ ఉండదు. కానీ మీరు ఒకసారి వ్యాపారం ఎలా చేస్తే బాగుంటుంది మీ ఏరియాలో ఏ విధంగా ఈ వ్యాపారాలను చేసి క్యాష్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుని దాని ద్వారా ఫాలో అయిపోతే ఎక్కువ లాభాలు వస్తాయి.