బిజినెస్ ఐడియా: బంగాళదుంపల చిప్స్ తో భారీగా లాభాలు..!

-

మీరు ఏదైనా బిజినెస్ ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? ఆ బిజినెస్ ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా ని కనుక ఫాలో అయ్యారంటే మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి అవుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది ఉద్యోగాలు కూడా కాదనుకుని వ్యాపారాలను చేయడానికి ఇష్ట పడుతున్నారు.

 

నిజానికి వ్యాపారాల ద్వారా లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. మరి ఇక ఈ బిజినెస్ ఎలా చేయాలి..?, ఈ బిజినెస్ కి ఎంత పెట్టుబడి పెట్టాలి మొదలైన వివరాలను ఇప్పుడు చూద్దాం. బంగాళదుంప చిప్స్ తయారు చేయడం వల్ల మంచిగా లాభాలు వస్తున్నాయి. దీని వల్ల మీ ఆదాయం పెరుగుతుంది. పైగా ఈ వ్యాపారం వలన ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. ఈ వ్యాపారం కోసం యంత్రాలు పరికరాలు అవసరం.

మీరు కావాలంటే ఖరీదైన మెషన్స్ ని కొనచ్చు లేదంటే తక్కువ ధరకే చిన్న యంత్రాలని కొనుగోలు చెయ్యచ్చు. ఎలా అయినా కూడా మీరు బంగాళాదుంప చిప్స్ వ్యాపారి ని మొదలు పెట్టొచ్చు. బంగాళదుంప చిప్స్ కోసం బంగాళదుంపలు, నూనె, ఉప్పు, మసాలా వంటివి అవసరం అవుతాయి. చిన్నచిన్న ప్యాకెట్లను ప్యాక్ చేసి మీరు సేల్ చేయొచ్చు.

మీకు దగ్గర లో ఉండే షాపులకు సప్లై చేస్తే మీకు ఎక్కువ సేల్ అవుతాయి ఆదాయం కూడా పెరుగుతుంది ముడిసరుకు పై ఖర్చు చేసిన డబ్బుకు ఏడు నుండి ఎనిమిది రెట్లు లాభాలు వస్తాయి. 10 కిలోల చిప్స్ ని మీరు అమ్మితే 1000 రూపాయలు వస్తాయి. మీరు క్వాలిటీ ని మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ సేల్స్ జరుగుతాయి. ఇలా ఎలా చూసుకున్నావా 2000 రూపాయల నుంచి 3 వేల రూపాయలు రోజుకు సంపాదించుకోవచ్చు. మంచిగా ఆదాయం పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news