మోసం చేసిన పార్టీకి ఓటు వేద్దామా..? : ఎంపీ ఈటల

-

తెలంగాణలో  కాంగ్రెస్ ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపి మోసం చేస్తోందని ఎంపీ ఈటల రాజేందర్  ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ ఈటల మాట్లాడారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది.. అడ్రస్ లేని ఫేక్ పేపర్లు, సోషల్ మీడియాలో అనేక రకాల విషప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. టీచర్లు, గ్రాడ్యుయేట్లు చాలా విజ్ఞులు కాబట్టి అలాంటి కుట్రలు, విషయ ప్రచారాలు, ఫేక్ వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ధీరుడు ఎప్పుడు బరిగీసి కొట్లాడుతారని, సత్తా లేనివారు మాత్రమే ఫేక్ వార్తలు ప్రచారం చేస్తారని ఫైర్ అయ్యారు.

గత నెల రోజులుగా సీరియస్ గా  బీజేపీ ప్రచారం చేస్తోందని, అందరూ ఇన్వాల్వ్ అయి సమన్వయంతో బ్రహ్మాండంగా ముందుకు పోతున్నారని తెలిపారు. దీన్ని చూసి ‘ఓర్వలేక, ఎట్లైనా చేసి ఓడగొట్టాలని డబ్బులు ఇచ్చి టికెట్లు తెచ్చుకున్నారు.. నాయకులను కించపరిచారు.. అంటూ విష ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. మోడీ నాయకత్వంలో 2024-25 లో నాలుగు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news