బిజినెస్ ఐడియా: ఈ పంటను ఒకసారి వేస్తే లక్షల్లో ఆదాయం పొందవచ్చు…

-

ఈ మధ్య చేస్తున్న జాబ్ వల్ల సంతృప్తి చెందని వాళ్ళు సొంతంగా వ్యాపారం చెయ్యాలని అనుకుంటారు..అందులోనూ వ్యవసాయం చెయ్యాలని అనుకోవడం సహజం..అయితే ఈ మధ్య డ్రాగన్ ఫ్రూట్స్ వేస్తూ చాలా మంది లక్షలు సంపాదిస్తున్నారు.ఇప్పుడు అంతే లాభాలను అందించె మరో పంట ఉంది..అదే నల్ల గోధుమల సాగు. ఈ రోజుల్లో చాలా మంది నల్ల గోధుమలను పండించి.. అధిక ఆదాయం పొందుతున్నారు. మార్కెట్లో నల్ల గోధుమ ధర చాలా ఎక్కువ. సాధారణ గోధుమల కంటే నల్ల గోధుమలను 4 రెట్లు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. వాస్తవానికి వీటి సాగుకు ఎక్కువ ఖర్చు అవుతుంది. అయినప్పటికీ ధర ఎక్కువగా ఉండడం వల్ల.. అధిక లాభాలను సంపాదించవచ్చు.

సాధారణంగా నల్ల గోధుమలను ఎక్కువగా రబీ సీజన్‌లో సాగు చేస్తారు. నవంబర్ నెలలో విత్తనాలు నాటితే మంచి దిగుబడి వస్తుందని చాలా మంది రైతులు చెబుతున్నారు. నల్ల గోధుమలకు తేమ చాలా ముఖ్యం. నవంబరు, అంతకంటే ముందే విత్తనాలను నాటుకోవాలి. నవంబర్ తర్వాత నల్ల గోధుమలను విత్తడం వల్ల దిగుబడి తగ్గుతుంది..యాంటీ- ఆక్సీడెంట్, యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది. ఇది గుండెపోటు, క్యాన్సర్, మధుమేహం, మానసిక ఒత్తిడి, మోకాళ్ల నొప్పులు, రక్తహీనత వంటి వ్యాధులను నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది..ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.అందుకే మన దేశంలో వీటికి డిమాండ్ భారీగా పెరిగింది.

నల్ల గోధుమలు సాదారణంగా క్వింటాల్‌కు రూ.7000-8000 వరకు అమ్ముడవుతుండగా, సాధారణ గోధుమలు క్వింటా రూ.2,000 మాత్రమే పలుకుతున్నాయని మీడియా కథనాలు చెబుతున్నాయి. సాధారణ గోధుమల కంటే నల్ల గోధుమ దిగుబడి కూడా మెరుగ్గా ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం.. ఒక ఎకరా భూమిలో 30 క్వింటాళ్ల నల్ల గోధుమలను ఉత్పత్తి చేయవచ్చు. మార్కెట్లో ఒక క్వింటాల్ నల్ల గోధుమ ధర 8వేలు ఉంటే, అప్పుడు 30 క్వింటాళ్లకు రూ. 2,40,000 ఆదాయం వస్తుంది. మీరు మూడు ఎకరాల్లో సాగుచేస్తే.. దాదాపు 7 లక్షల వరకు రాబడి వస్తుంది..ఈ పంటను ఎలా వెయ్యాలి..నేల, విత్తన సాగు గురించి ముందుగా వ్యవసాయ సలహాదారుడి సలహా తీసుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Exit mobile version