బిజినెస్ ఐడియా: ఈ సాగుతో ఏకంగా రూ.4 లక్షల ఆదాయం…!

-

ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది వ్యాపారాలని చేస్తున్నారు. అలానే పంటల పండించడం పై కూడా దృష్టి పెడుతున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్, ఔషధ మొక్కలు సాగు చేయడం ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అనుసరిస్తున్నారు. అయితే మీరు కూడా ఏదైనా వ్యాపారం చేయాలని చూస్తున్నారా..? దాని నుండి మంచిగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా ని ఫాలో అవ్వండి. ఈ బిజినెస్ ఐడియా ని అనుసరించడం వలన మంచి డబ్బులు వస్తాయి.

పైగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. నాలుగు లక్షల ఆదాయం వస్తుంది. పైగా ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు కేవలం 80,000 దీనికి ఖర్చు పెడితే సరిపోతుంది. ఔషధ మొక్కలు సాగు పై మీరు కనుక దృష్టి పెడితే ఖచ్చితంగా ఎక్కువ ఆదాయం వస్తుంది. ఔషధ మొక్కలలో సర్పగంధ చాలా ప్రాధాన్యతని కలిగి వుంది. సర్పగంధ సాగు ద్వారా ఎక్కువ డబ్బులను సంపాదించుకోవచ్చు. ఆయుర్వేద వైద్యంలో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇంగ్లీష్ మందుల్లో కూడా దీన్ని వాడుతూ ఉంటారు ఈ పంటని మీరు ఒకసారి మొదలు పెట్టారంటే ఏడదిన్నరలో పంట చేతికే వస్తుంది.

80 వేల వరకు మీకు ఈ పంట కోసం ఖర్చు అవుతాయి ఆదాయం మాత్రం నాలుగు లక్షలు నుండి ఐదు లక్షలు వరకు వస్తుంది. ఈ మొక్క పూలు పండ్లు కాడలు వేర్లు ఇవన్నీ కూడా మందులలో ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి అసలు మీరు పంట కోసం చూసుకోక్కర్లేదు. అయితే మీరు ఈ పంట పండించడం కోసం జిగురుగా ఉండే నేలని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పంట బాగా పండుతుంది. నల్ల మట్టి దీనికి అనుకూలంగా ఉంటుంది. వాతావరణంలో తేమ ఎక్కువ ఉంటే పంట బాగా వస్తుంది. మట్టిలో పీహెచ్ 4.6 నుండి 6.5 వరకు ఉంటే మంచిది.

సేంద్రియ పదార్థాలని, నైట్రోజన్ మట్టిలో కలపాలి. అలానే మట్టిలో పెద్దపెద్ద రాళ్ళు ఉండకుండా చూసుకోవాలి. జూన్, ఆగస్టు మధ్య మీరు ఈ సాగు మొదలు పెడితే చాలా అనుకూలంగా ఉంటుంది. సర్పగంధ విత్తనాలు కేజీ నాలుగువేల వరకు ఉంటున్నాయి, ఎకరానికి 30 కేజీల విత్తనాలు అవసరమవుతాయి. ఇలా మీరు అనుసరిస్తే 25 నుండి 30 క్వింటాల్ దిగుబడి వస్తుంది. కేజీ మీరు 70 రూపాయల నుంచి 80 రూపాయల వరకు అమ్ముకోవచ్చు. ఇలా ఈ సాగు ద్వారా 4 లక్షల నుండి 5 లక్షల వరకు సంపాదించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version