బిజినెస్ ఐడియా: పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించేందుకు ఈ ఐడియాని ఫాలో అవ్వచ్చు..!

-

చాలా మంది వ్యాపారాలను చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. పెట్టుబడి లేని వ్యాపారం చేయాలని మీరు కూడా అనుకుంటున్నారా..? అయితే తప్పకుండా ఈ బిజినెస్ ఐడియాని చూడండి. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది వ్యాపారాలను చేయడానికి ఇష్టపడుతున్నారు. దాని కోసం ఉద్యోగాలను కూడా వదిలేసుకున్నారు. ఈ వ్యాపారాన్ని పెట్టుబడి లేకుండా చేయొచ్చు పైగా ఎటువంటి రిస్కు కూడా ఉండదు.

మరి ఇక వివరాల్లోకి వెళితే.. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేయడం వల్ల సమయం ఉండడం లేదు. ఏదైనా పెళ్లిళ్లు వచ్చినా కూడా తగినంత సమయం దానికోసం కేటాయించలేక పోతున్నారు. దీనినే మీరు క్యాష్ చేసుకోవచ్చు. వెడ్డింగ్ ప్లానర్ల కింద పని చేసి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. భోజనాలు, డెకరేషన్, పెళ్లి మండపం వంటివి సిద్ధం చేయాల్సి ఉంటుంది.

ముందే మీరు కాంట్రాక్ట్ తీసుకుని మంచిగా డబ్బులు పొంది వీటినన్నిటినీ చేయొచ్చు. అయితే మీరు ఎంత తీసుకోవాలి అనేది కాంట్రాక్ట్ ని బట్టి ఉంటుంది. ఈ మధ్యకాలంలో వెడ్డింగ్ ప్లానర్ అనేది కెరియర్ కింద మారింది. డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కళ్ళు మూసుకుని మొదలు పెట్టొచ్చు. అయితే వెడ్డింగ్ ప్లానర్ గా ఏదైనా కోర్సు చేయాలి.

చాలా ఇన్స్టిట్యూట్లు ఈ కోర్సులను అందిస్తున్నాయి. లేదంటే మీరు వెడ్డింగ్ ప్లానర్ కింద ఏదైనా కంపెనీలో ఉద్యోగంలో కూడా చేయొచ్చు. మీరు ఈ బిజినెస్ చేయాలంటే మీకు ఒక ఆఫీస్ ఉండాలి. మొదట మీరు ఇంటి దగ్గరే ఆఫీస్ ని పెట్టుకోవచ్చు అలానే మీకు కొన్ని కాంటాక్ట్ లు ఉండాలి.

భోజనాలు వాళ్లతో, బ్యాండ్ మేళం, డీజే వీళ్ళతో మీకు కొంచెం కాంటాక్ట్ ఉంటే ఈజీగా మీరు తర్వాత వెడ్డింగ్స్ కి చెప్పుకోవచ్చు దీనికోసం మీరు పెట్టుబడి పెట్టక్కర్లేదు. మొదట మీరు ఈవెంట్ ఆర్డర్లుని తీసుకుని దానిని పెట్టుబడి కింద పెట్టుకోవచ్చు. ఇలా ఈ విధంగా మీరు వెడ్డింగ్ ప్లానింగ్ చేసి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈజీగా ఒక పెళ్ళికి లక్ష రూపాయలు వరకు వస్తాయి ఎలా చూసుకున్నా నెలకు 50000 వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version