బిజినెస్ ఐడియా: ఇలా కూడా మీరు డబ్బులు సంపాదించచ్చు తెలుసా..?

-

చాల మంది ఆర్ధికంగా ఇబ్బందులు పడడమో, ఉద్యోగం లేక ఇబ్బంది పడడమో జరుగుతూ ఉంటుంది. అయితే మనసు ఉంటే మార్గం ఉంటుంది అని నమ్మితే ఏదైనా సాధ్యం. ఇక్కడ చాల సింపుల్ గా సంపాదించడానికి మార్గాలు వున్నాయి.

వాటిని చూసి ఈజీగా డబ్బుల్ని సంపాదించండి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీకోసం. పైగా కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. కనుక మీరు వీటిని తప్పక తెలుసుకోండి.

మొబైల్ టవర్‌కు అద్దెకి ఇవ్వండి:

మీ మేడ ఖాళీగా ఉంటే మీరు మొబైల్ టవర్‌కు అద్దెకి ఇవ్వచ్చు. దాని వలన మీకు డబ్బులు వస్తాయి. మొబైల్ టవర్‌ను స్థాపించడానికి మీ ఇంటి పైకప్పును అద్దెకు ఇవ్వవచ్చు. దీనివల్ల మీకు ఎటువంటి ప్రమాదం కూడా ఉండదు. అలానే మంచి ఆదాయం కూడా ఉంటుంది.

మొబైల్ టవర్‌ను వ్యవస్థాపించడానికి మీరు టెలికాం కంపెనీని లేదా వారి ఏజెంట్‌ను సంప్రదించాలి. అయితే ఎంత వస్తుంది అనే విషయానికి వస్తే… 30 వేల రూపాయల నుంచి మిలియన్ల వరకు వస్తుంది. అయితే ముందు చుట్టుపక్కల ప్రజల నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ మరియు మునిసిపల్ కార్పొరేషన్ లేదా అథారిటీ నుంచి అనుమతి తీసుకోవాలి. అనుమతి వచ్చేస్తే ఆద్యం వచ్చేసినట్టే.

సోలార్ ప్లాంట్ల ఏర్పాటు:

లేదా విద్యుత్ అవసరాలను దృష్టి లో ఉంచుకుని ప్రభుత్వం సోలార్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఇంటి ఖాళీ పైకప్పును అద్దెకు తీసుకోవచ్చు. ఇలా ప్రతిగా కంపెనీ మీకు మంచి మొత్తాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలా చేసి కూడా మంచి ఆదాయం పొందవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version