బిజినెస్ ఐడియా: ఆవు పేడతో బిజినెస్..నెలకు 3 లక్షల ఆదాయం..

-

పాడి పశువులు ఇంట్లో వుంటే ఆదాయం తో పాటు ఆనందం కూడా ఉంటుంది.. అందుకే రైతన్నలు పశువులను పెంచుకోవడం ఎక్కువగా చేస్తారు.అయితే పాలు, పెరుగుతో పాటు వాటి పేడకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఉద్యోగాలు లేని యువత ఇలా చిన్న బడ్జెట్ తో మొదలయ్యె వ్యాపారాలు చేస్తున్నారు.అందులో ఆవు పేడతో ఒకటి..ఓ యువకుడు ఆవు పేడతో పలు వస్తువులు తయారు చేసి ప్రస్తుతం లక్షల్లో సంపాదిస్తున్నాడు..

ఆవు పేడ మంచిదని తెలిసిందే. గోధనంగా పేరొందిన ఆవు పేడతో తయారుచేసిన వస్తువులను అమ్మి కొందరు ప్రతినెలా లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు.రాయ్ పూర్ కు చెందిన ఏక్ పహల్ సంస్థ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ ఆవు పేడతో తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించడం ద్వారా ప్రతి నెలా మూడు లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు. గత మూడేళ్లుగా ఆవు పేడతో ఎన్నో ఉత్పత్తులను తయారు చేసి అమ్ముతున్నాడు. ఇలా ఎంతో మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు. అతని వద్ద ప్రస్తుతం 400 పైగా ఆవులు ఉన్నాయి.

ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ఇటీవల రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆయన బడ్జెట్ పత్రాలు తెచ్చిన బ్రీఫ్ కేస్ ఆవు పేడతో తయారు చేసిందని సభా ముఖంగా తెలిపారు. దీంతో ఈ బ్యాగ్ పై పెద్ద చర్చే జరిగింది. రితేష్ బృందం 10 రోజుల్లో ఈ బ్యాగ్ ని తయారు చేసింది.పెద్ద చదువులు చదివాడు. మంచి ఉద్యోగాలు చేశాడు.చెత్త తిని అనారోగ్యానికి గురవుతున్న ఆవులను వీధుల్లో చూసి చలించిపోయాడు. వాటి పరిస్థితి చూసి తట్టుకోలేక 2015లో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. గోశాలను నిర్మించాడు. అదే సమయంలో ఆవు పేడ నుంచి సంపాదించాలనే ఆలోచన వచ్చింది. ఆవు పేడతో చెప్పులు, బ్యాగులు, పర్సులు, శిల్పాలు, దీపాలు, ఇటుకలు, రంగులు తయారు చేయడం మొదలుపెట్టాడు. తర్వాత వాటిని విక్రయించేవాడు. వ్యాపారం అభివృద్ధి చెందుతూ వచ్చింది. హోలీ సందర్భంగా ఆవు పేడతో పర్యావరణరహితమైన రంగులను కూడా తయారు చేసి విక్రయించాడు. ఇలా తన ఆదాయం ప్రతి నెల 3 లక్షలు ఉంటుంది. అంతేకాదు అతను మరో 23 మందికి ఉద్యోగాన్ని కూడా ఇచ్చారు.. ఇంకా భవిష్యత్తు లో బిజినెస్ ను పెంచాలనే ఆలోచనలో వున్నాడు..

Read more RELATED
Recommended to you

Latest news