Business Ideas : ”దేసీ టీ టైం ఔట్‌లెట్” ‌తో.. చ‌క్క‌ని స్వ‌యం ఉపాధి..!

-

మ‌న‌లో అధిక శాతం మంది త‌మ రోజు వారీ దిన‌చ‌ర్య‌ను వేడి వేడి టీతో ప్రారంభిస్తారు. కొంద‌రికి టీ తాగ‌నిదే.. ఏ ప‌ని చేయ‌బుద్ది కాదు. టీ తాగ‌క‌పోతే.. ఏదో కోల్పోయిన‌ట్లు కొంద‌రికి అనిపిస్తుంది. ఈ క్ర‌మంలోనే చాయ్ ప్రియుల ఇష్టాల‌కు అనుగుణంగా ర‌క ర‌కాల టీలు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే భిన్న‌ర‌కాలైన టీ రుచుల‌ను అందించే.. దేసీ టీ టైం ఔట్‌లెట్‌ల గురించి మీరు వినే ఉంటారు. వాటిల్లో ర‌క ర‌కాల టీల‌తోపాటు మిల్క్ షేక్‌లు, ఫ్లేవ‌ర్డ్ మిల్క్‌ల‌ను కూడా విక్ర‌యిస్తుంటారు. నిజానికి పెట్టుబ‌డి పెట్టే సామ‌ర్థ్యం ఉంటే.. ఈ టీ టైంకు చెందిన ఔట్‌లెట్ పెట్ట‌డం ద్వారా చ‌క్క‌ని ఆదాయం సంపాదించ‌వ‌చ్చు. మ‌రి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

దేసీ టీ టైం కంపెనీ మ‌న దేశంలో చాలా ఫేమ‌స్‌. ఈ కంపెనీకి చెందిన కార్పొరేట్ ఆఫీస్ హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉంది. తెలంగాణ‌, ఏపీ, త‌మిళ‌నాడు, కేర‌ళ‌లో ఈ కంపెనీకి చెందిన సుమారు 200కు పైగా ఔట్‌లెట్స్ ర‌న్నింగ్‌లో ఉన్నాయి. అయితే ఇదే కంపెనీ ఔట్‌లెట్‌ను ఫ్రాంచైజీగా తీసుకుని ప్రారంభిస్తే.. దాంతో పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించ‌వ‌చ్చు. అయితే అందుకు గాను ఆ కంపెనీని సంప్ర‌దించాలి. వారు ఔట్‌లెట్ ఎలా పెట్టాలి..? అందులో ఏమేం విక్ర‌యించాలి..? అన్న వివ‌రాల‌తోపాటు శిక్ష‌ణ కూడా ఇస్తారు. ఇక ఫ్రాంచైజీ తీసుకుని ఔట్‌లెట్ పెట్టేందుకు ఆ కంపెనీ వారికి రూ.4.25 ల‌క్ష‌ల‌ను ఫీజు కింద చెల్లించాలి. దీంతో ఔట్‌లెట్ పెట్టాక అందులోకి అవ‌స‌రం అయ్యే ప‌దార్థాల‌ను వారే స‌ర‌ఫ‌రా చేస్తారు.

ఇక టీ టైం ఔట్‌లెట్‌ను పెట్టేందుకు క‌నీసం 150 నుంచి 200 చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లం ఉండే షాపు కావాలి. దానికి అడ్వాన్స్, నెల నెలా అద్దె చెల్లించాలి. ఇక ఔట్‌లెట్‌లో చేసే బిజినెస్ నుంచి కంపెనీకి 3 శాతం రాయ‌ల్టీ చెల్లిస్తే చాలు.. మిగిలిన‌దంతా లాభం రూపంలో వ‌స్తుంది. జ‌న సాంద్రత ఎక్కువ‌గా ఉండే ప్ర‌దేశాల్లో ఔట్‌లెడ్ పెడితే ఎక్కువ ఆదాయం వ‌స్తుంది. ఇక ఈ బిజినెస్ పెట్టేందుకు గాను ఎవ‌రైనా స‌రే.. ముందుగా ఇందులో ఎలా ముందుకు సాగాలి, ఎలా బిజినెస్ చేయాలి, ఏ మేర లాభాలు వ‌స్తాయి.. అన్న అంశాల‌ను ప‌రిశీలించాలి. అందుకు అవ‌స‌రం అయితే ఇది వ‌ర‌కే ఔట్‌లెట్ న‌డిపిస్తున్న వారి వ‌ద్ద‌కు వెళ్లి వివ‌రాలు అడిగి తెలుసుకోవ‌చ్చు.

దేసీ టీ టైం ఔట్‌లెట్ పెట్టేందుకు జ‌నాలు ఎక్కువ‌గా ఉండే లొకేషన్‌ను ముందుగా ఎంపిక చేసుకోవాలి. ఆ త‌రువాత ఆ ఏరియాలో షాపు అద్దెకు తీసుకుని అనంత‌రం ఔట్‌లెట్ ప్రారంభించ‌వ‌చ్చు. కొద్దిగా శ్ర‌మించి, పెట్టుబ‌డి పెట్టే సామ‌ర్థ్యం ఉంటే ఈ బిజినెస్ ద్వారా నెల‌కు రూ.వేల‌ల్లో సంపాదించ‌వ‌చ్చు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version