మట్టికప్పుల వ్యాపారంతో మంచి ఆదాయం.. పెట్టుబడి ఐదువేలే..!

-

వ్యాపారం చేయడం కాదు.. బాగా లాభాలను ఇచ్చే వ్యాపారం చేయడం ముఖ్యం. దందా స్టాట్ చేయాలంటే.. మీ దగ్గర కేవలం డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు. ఆ వ్యాపారం చేసే ప్లేస్‌, మీరు ఉత్పత్తి చేసే ప్రొడెక్ట్స్‌కు మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ ఇవన్నీ కూడా కీ రోల్‌ ప్లే చేస్తాయి. మీ దగ్గర తక్కువ పెట్టుబడి ఉన్నా డిమాండ్‌ ఎక్కువగా ఉన్న వ్యాపారం చేయడం వల్ల లాభాలను పొందవచ్చు. కేవలం ఐదు వేల పెట్టుబడితే చేయదగ్గ సూపర్‌ బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం.

మంచి ఆదాయాన్ని అందించే పర్యావరణ హితమైన సంప్రదాయ మట్టి కప్పులు (కుల్హాద్) వ్యాపారం. ఈరోజుల్లో చాలా మంది వంటగదుల్లో మళ్లీ మట్టిపాత్రలు దర్శనమిస్తున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. అల్యూమినియం, స్టీల్‌, నాన్‌స్టిక్‌ ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచివి కావని జనాలు మెల్లగా తెలుుకుంటున్నారు. మొత్తంగా కాకపోయినా.. కొన్ని డిష్‌లను మట్టిపాత్రలతో రీప్లేస్‌ చేస్తున్నారు. ముఖ్యంగా టీ, కాఫీ తాగేందుకు కప్పులు, పెనంలు, పెరుగు తయారుచేసేపాత్రలు ఇలాంటి వాటి కోసం మట్టి పాత్రలనే వాడుతున్నారు. కాబట్టి మీరు ఇలాంటి వ్యాపారం చేస్తే బాగా లాభాలను పొందవచ్చు.

పర్యావరణ అనుకూలమైన మట్టి కప్పులు ప్లాస్టిక్ కప్పులకు ప్రత్యామ్నాయంగా మంచి గుర్తింపు పొందాయి. దీంతో కుల్హాద్‌ల బిజినెస్ ప్రారంభించి లాభాలు పొందవచ్చు. ఈ వ్యాపార ప్రారంభానికి పెద్దగా పెట్టుబడి కూడా అవసరం ఉండదు. కేవలం రూ.5,000 కనీస మూలధన పెట్టుబడితో చిన్న స్థలంతో ప్రారంభించవచ్చు.

మట్టి పాత్రల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2020లో కుమ్హర్ సశక్తికరణ్ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. అట్టడుగు వర్గాలైన కుమ్మరులను ఆర్థికంగా ఆదుకోవడం, కుండల తయారీ కళను ప్రోత్సహించడం ఈ పథకం ఉద్దేశం. ఈ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ కుండల చక్రాల(ఎలక్ట్రిక్ చాక్)ను సబ్సిడీతో మంజూరు చేస్తోంది. ఈ పథకాన్ని వినియోగించుకుని తక్కువ పెట్టుబడితో కుల్హాద్‌ బిజినెస్‌ను ప్రారంభించవచ్చు.

ప్లాస్టిక్, పేపర్ కప్‌ల వినియోగాన్ని దశలవారీగా తగ్గించడానికి కుల్హాద్‌లు ఉపయోగపడతాయని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కుల్హాద్‌లలో టీ అందించడం పర్యావరణానికి మేలు చేయడంతో పాటు డబ్బును ఆదా చేస్తుంది. ఎందుకంటే ప్లాస్టిక్ కప్పుల వంద యూనిట్స్ ధర రూ.100గా ఉంది. టీ మట్టి కప్పులు వంద యూనిట్స్ కేవలం రూ.50కే లభిస్తున్నాయి. లస్సీ కుల్హాడ్స్, మిల్క్ కుల్హాడ్స్ వంద యూనిట్లకు రూ.150కు లభిస్తున్నాయి.

ఒక రోజుకు 500 చొప్పున టీ, లస్సీ మట్టి కప్పులను అమ్మడం ద్వారా రూ.1000 ఆదాయం పొందవచ్చు. అయితే వీటి డిమాండ్ అధికంగా ఉండే రెస్టారెంట్, టీ షాప్‌లతో ఒప్పందం కుదర్చుకుంటే రోజువారీ సంపాదన రూ. 5,000 నుంచి రూ.7,000 వరకు రావచ్చు. ఆ లెక్కన నెలవారీ ఆదాయం లక్షల్లో ఉంటుంది.

ఏ వ్యాపారంలో అయినా పాజిటివ్‌ నెగిటివ్‌ రెండూ చూసుకోవాలి. ఇందులో మీరు కష్టపడాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version