Starbucks’ New CEO : స్టార్​బక్స్ సీఈఓగా లక్ష్మణ్ నరసింహన్​

-

స్టార్​బక్స్ ఈ పేరు తెలియని యువతీయువకులు ఉండరు. కాలేజ్ టైం అయిపోగానే స్నేహితులతో.. ఆఫీసు సమయంలో మధ్యలో కాస్త రీఫ్రెష్ అవుదామని కొలీగ్స్ తో వెళ్లాలనుకుంటే ది బెస్ట్ ప్లేస్ ఇది. ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే.. ఈ స్టార్​బక్స్​కు సీఈఓగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్​ నియమితులయ్యారు. కేవలం కంపెనీకి సీఈఓగానే కాకుండా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్​లో సభ్యుడిగానూ ఉంటారని స్టార్​బక్స్ గురువారం ప్రకటించింది. అక్టోబరు 1న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది.

55 ఏళ్ల నరసింహన్ బ్రిటన్​కు చెందిన రెకిట్ బెంకిజర్ అనే బహుళజాతి కంపెనీకి సీఈఓగా పనిచేశారు. సెప్టెంబరు 30న రెకిట్ బెంకిజర్ కంపెనీ సీఈఓ బాధ్యతల నుంచి లక్ష్మణ్ నరసింహన్ వైదొలిగినట్లు సంస్థ తెలిపింది. ‘అమెరికాకు తిరిగి రావడానికి నాకు అవకాశం లభించింది. లండన్​ను విడిచిపెట్టి రావడం కష్టతరమైనప్పటికీ.. కుటుంబం కోసం కఠిన నిర్ణయం తీసుకుంటున్నా’ అని లక్ష్మణ్ నరసింహన్ తెలిపారు. లక్ష్మణ్ నరసింహన్​ సీఈఓగా నియమితులవ్వడం వల్ల భారత సంతతికి చెందిన మరో వ్యక్తి ఉన్నత శిఖరాన్ని అధిరోహించనట్లైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version