నోకియా సంచలన నిర్ణయం.. 14వేల మందికి ఉద్వాసన..!

-

ప్రస్తుతం మార్కెట్ రంగాల్లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడం కోసం ఉద్యోగాల్లో కోతలను విధిస్తున్నాయి. ఐటీ సెక్టార్ మాత్రమే కాకుండా పలు ఇతర రంగాలు కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలికే యోచన లో ఉన్నాయి. తాజాగా మరో దిగ్గజ సంస్థ వేలాదిమంది సిబ్బందికి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. నోకియా కంపెనీ ఆర్థికంగా పుంజుకోవడానికి ఖర్చులు తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది.

ఇందుకోసం ఏకంగా తన కంపెనీలో పని చేస్తున్నటువంటి 14 వేల మందిని విధుల నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించింది. ఉత్తర అమెరికాలో సంస్థ పరికరాలకు డిమాండ్ తగ్గడంతో నోకియా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మూడో త్రైమాసికంలోనూ అమ్మకాలు 20 శాతం వరకు క్షీణించాయి. దీంతో రాబోయే రోజుల్లో కాస్ట్ కటింగ్ పేరిట ఉద్యోగులకు కోత విధించనుంది. ప్రస్తుతం నోకియాలో 86 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కోత విధిస్తే.. 72,000 మంది మాత్రమే ఉద్యోగులు మాత్రమే ఉంటారు. ఈ 14 వేల మంది ఉద్యోగుల పరిస్థితి ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news