స్ఫూర్తి : కోచింగ్ కోసం 12 కి.మీ రోజూ… BSFలో జాబ్‌.. ఈమె సక్సెస్ ని చూస్తే మెచ్చుకుంటారు..!

-

కొంతమంది సక్సెస్ ని చూస్తే చప్పట్లు కొట్టాలని అనిపిస్తుంది చాలామంది పేదరికం నుండి వచ్చి కూడా మంచి ఉద్యోగాలని సంపాదిస్తున్నారు. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు పట్టుదల అంకితభావంతో కృషి చేస్తే ఏదైనా సాధించొచ్చు. ఎవరు సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు లక్ష సాధనలో అడుగడుగునా ఎన్నో అవాంతరాలు వస్తూ ఉంటాయి. ఆత్మవిశ్వాసం గుండె ధైర్యం ఓర్పు ఉంటే వీటన్నిటిని అధిగమించవచ్చు.

 

బీహార్ వెనుకబడిన రాష్ట్రం విద్యారంగంలో అక్కడ మౌలిక సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. గయ లాంటి ప్రాంతాలలో అయితే నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంత పరిధిలో ఇమామ్ గంజ్ బ్లాకు నుండి తొలిసారి ఐదుగురు యువతులు దేశ రక్షణ రంగంలో బిఎస్ఎఫ్ లో కొలువు సాధించారు అయితే వాళ్లలో పూనం కూడా ఒకరు. ఆమెకి దేశ సేవ చేయాలంటే చేయడం అంటే ఇష్టం డబ్బులు లేకపోయినా ఆమె సైకిల్ మీద వెళ్లి చదువుకునేది కోచింగ్ తీసుకునేది.

ఉద్యోగం కోసం నిర్వహించిన పరీక్షలో పాస్ అయింది ఫిజికల్ ట్రైనింగ్ కోసం డబ్బులు లేవు ఆ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ అధికారి సహాయం చేయడంతో ఉచితంగా ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుంది. తర్వాత ఆమెకి ఉద్యోగం వచ్చినట్లు కన్ఫర్మేషన్ లెటర్ వచ్చింది పూనం తండ్రి రాజేష్ దాస్ చెన్నైలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారు. తన తల్లి గృహిణి వీళ్ళిద్దరూ కూడా ఆమె సక్సెస్ లో కీలక పాత్రలు పోషించారు ఎక్కడో మారుమూల గ్రామం నుండి వచ్చి ఇంత ఎత్తు ఎదగడం మామూలు విషయం కాదు.

Read more RELATED
Recommended to you

Latest news