ఈ బిజినెస్‌ చేస్తే నెలకు 22 వేల నుంచి 50 వేలు.. పెట్టుబడి తక్కువే

-

ఉద్యోగం పురుష లక్షణం అనేవాళ్లు.. కానీ ఇప్పుడు ఉద్యోగాలు ఒకప్పుడు ఉన్నట్లు లేవు. ఇచ్చే జీతానికి చేసే పనికి పొంతన ఉండదు. ఇంత కష్టపడినా గుర్తింపు ఉండదు. అవసరం లేదనుకుంటే ఫైరింగ్ చేస్తారు. ఎప్పుడు జాబ్‌ పోతుందో అని టెన్షన్‌ పడే కన్నా ఏదో ఒక వ్యాపారం చేసుకునేది బెటర్రా బాబు అని చాలా మంది అనుకుంటున్నారు. మీకు కూడా ఇదే ఆలోచన ఉంటే ఒక్కసారి ఈ బిజినెస్‌ ఐడియా వైపు చూడండి. దీనికి పెట్టుబడి తక్కువే. అలా అని లాభం కూడా తక్కువే అంటారేమో.. ! పైసలు దండిగానే వస్తాయి.

కేవలం రూ. 22, 000 వేలతో ప్రారంభించి నెలకు రూ. 50 వేలకు పైగా సంపాధించవచ్చు. మీరు కార్ వాషింగ్ బిజినెస్ గురించి వినే ఉంటారు. ఇది మీకు రోడ్డు పక్కన సాధారణ వ్యాపారంలా కనిపిస్తుంది కానీ.. ఈ వ్యాపారంలో పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది. ఈ వ్యాపారం మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీకు అదృష్టం కలిసి వస్తే మెకానిక్‌ని కూడా నియమించుకుని వాషింగ్‌తో పాటు, మీరు కారు మరమ్మతు బిజినెస్ కూడా ప్రారంభించవచ్చు.

ఎలా ప్రారంభించాలి?:

కార్ వాషింగ్ కోసం ప్రొఫెషనల్ మెషిన్ అవసరం. మార్కెట్లో అనేక రకాల యంత్రాలు ఉన్నాయి. ఈ యంత్రాల ధర రూ.12 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. మీరు చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, మీరు తక్కువ ఖర్చుతో కూడిన యంత్రాన్ని కొనుగోలు చేయండి. దీని కోసం మీరు రూ.14,000తో ఒక యంత్రాన్ని కొనుగోలు చేశారనుకుందాం.

ఈ ధరతో మీరు రెండు హార్స్ పవర్ యంత్రాలని పొందుతారు. అదనంగా, మీరు 30 లీటర్ల వాక్యూమ్ క్లీనర్‌ను కొనుగోలు చేయాలి. దీని ధర దాదాపు రూ. 9 వేల నుంచి రూ.10 వేల రూపాయలు. షాంపూ, గ్లోవ్స్, టైర్ పాలిష్ మరియు డాష్‌బోర్డ్ పాలిష్‌తో సహా అన్ని వస్తువులకు రూ. 2 వేల వరకు ఖర్చు అవుతుంది.

మీరు రద్దీ లేని ప్రదేశంలో మీ వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. తద్వారా ఇతరులకు ఇబ్బంది ఉండదు. ఏవరైనా కార్ మెకానిక్‌తో ఒప్పందం చేసుకుంటే అతని రిపేర్ షాప్ పక్కనే ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు. తద్వారా ఇద్దరికి మేలు చేకూరుతుంది. కార్ వాషింగ్ కోసం ఛార్జీ నగరం నుంచి నగరానికి మారుతుంది. ఒక చిన్న పట్టణంలో సాధారణంగా కారు వాషింగ్ కోసం దాదాపు రూ.150-450 వసూలు చేస్తారు. పెద్ద నగరంలో ఈ ఖర్చు కాస్త ఎక్కువగానే ఉంటుంది. పెద్ద కార్లతో పాటు SUV కార్లకు కూడా అధిక ధరలు ఉంటాయి.

మీరు ప్రతిరోజూ 7-8 కార్లు మీ వద్దకు వస్తే మీ రోజువారీ సంపాదన కనీసం రూ. 2,000 వరకు ఉంటుంది. అంటే నెలకు రూ. 40 వేల నుంచి రూ.50 వేలు సంపాధించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news