ఆ దేశంలో ఎంత సంపాదించినా పన్ను కట్టాల్సిన అవసరం లేదట

-

పన్ను కట్టాలంటే మన ప్రాణానికి వస్తుంది. అసలు కష్టపడేది మనం, సంపాదించేది మనం పన్ను ఎందుకు కట్టాలి అని చాలా సార్లు అనుకోని ఉంటాం కదా.! ఎంత సంపాదించినా.. పన్ను కట్టాల్సిన అవసరం లేదంటే.. అలాంటి దేశం ఉంటుందా.. అంటే ఉంటుంది.కొన్ని దేశాల్లో అసలు ఆదాయ పన్ను అనేదే ఉండదు. ఈ లిస్ట్‌లో ఉన్న ముఖ్యమైన దేశాలు ఇవే.

tax
tax

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) : మధ్యప్రాచ్యంలో చమురు ఉత్పత్తి చేసే దేశాలకు ఆదాయ పన్ను లేదా కార్పొరేట్ పన్ను లేదు. ముఖ్యంగా లగ్జరీ లైఫ్‌కు పేరొందిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పౌరులపై ఎలాంటి పన్ను వసూలు చేయదట. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, మల్టీ కల్చరల్ ఎన్విరాన్‌మెంట్‌తో ఈ దేశం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.

మొనాకో : ఈ దేశం అత్యంత సంపన్న వ్యక్తులకు ప్రసిద్ధి చెందిన హై-ఎండ్ వెకేషన్ స్పాట్. పెద్ద పెద్ద భవనాలతో అద్భుతంగా ఉంటుంది. ఈ దేశం కూడా తమ ప్రజలపై ఆదాయ పన్ను విధించదు. అత్యంత ఖరీదైన ప్రదేశాలలో ఒకటైన మొనాకోలో క్రైమ్ రేటు సైతం చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడి వ్యక్తులు లీగల్ రెసిడెన్స్ పర్మిట్ తీసుకోవాలి. ఇది మూడు నెలలలోపు లభిస్తుంది. ఇందుకు 5,00,000 యూరోలు ఖర్చవుతుంది.

బహామాస్ : బహామాస్ పౌరులు ప్రభుత్వాలకు ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఎంటర్‌ప్రెన్యూర్స్, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్‌కు ఈ దేశం స్వర్గథామంగా ఉంటుంది. బహమాస్ పౌరసత్వానికి బదులుగా నివాసాన్ని (రెసిడెన్సీ) పరిగణనలోకి తీసుకుంటుంది. కనీసం 90 రోజులు ఆ దేశంలో చట్ట ప్రకారం నివసించే వ్యక్తులు పర్మినెంట్ రెసిడెన్సీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అబ్బా.. ఎంత బాగుందోకదా..మూడు నెలలు ఉంటే చాలా..! ప్రవాసుల విషయానికొస్తే, వారు కనీసం 10 సంవత్సరాల వరకు ఆస్తిని కలిగి ఉండాలి.

బెర్ముడా : ఈ కరేబియన్ కంట్రీ ఆదాయ పన్ను రహిత దేశం. పింక్ శాండ్ బీచ్‌లు, టాప్ రేంజ్ రెస్టారెంట్లు, సహజ అందాలకు ప్రసిద్ధి చెందిన బెర్ముడా, తమ పౌరులపై పర్సనల్ ఇన్‌కమ్ ట్యాక్స్ విధించదు. అయితే ఎంప్లాయర్స్‌పై పేరోల్ ట్యాక్స్, టెనెన్ట్స్‌పై ల్యాండ్ ట్యాక్స్ విధిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news