బిజినెస్ ఐడియా: ఇలా ఇంట్లో వుండే మహిళలు డబ్బులు సంపాదించుకోచ్చు..!

-

ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకరు సంపాదిస్తుంటే వచ్చే ఆదాయం సరిపోవడం కష్టమనే ఇంట్లో ఉండే మహిళలు కూడా పని చేస్తున్నారు. అయితే మీరు హౌస్ వైఫ్ ఆ..? మీరు కూడా ఏదో ఒక లాగ ఇన్కమ్ పొందాలని భావిస్తున్నారా…? అయితే మీకోసం కొన్ని బిజినెస్ ఐడియాస్. ఈ బిజినెస్ ఐడియాస్ ని కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా మంచిగా ఆదాయం వస్తుంది. అయితే మరి ఐడియాస్ గురించి ఇప్పుడు చూసేద్దాం.

నర్సరీ గార్డెన్:

ఇది నిజంగా ఇంట్లో ఉండే గృహిణుల కి మంచి బిజినెస్ అని చెప్పవచ్చు. 100 గజాల స్థలం ఉంటే చక్కగా ఈ బిజినెస్ ని మీరు మొదలు పెట్టొచ్చు ప్రభుత్వం కూడా ఈ తరహా వ్యాపారాలకు ఆర్థిక సహాయం చేస్తుంది. ముద్ర పథకం ద్వారా రుణాలు పొంది.. కొత్త తరహా మొక్కల్ని అందుబాటులో ఉంచడం ద్వారా నర్సరీ అద్భుతంగా రన్ చేసి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు.

మొలకలు :

ఎక్కువమంది పోషకాహారం మీద శ్రద్ధ పెడుతున్నారు. ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ బిజినెస్ బాగా హెల్ప్ అవుతుంది ఇది నిజంగా మీకు మంచి అవకాశం. మొలకెత్తిన విత్తనాలు విక్రయించడం ద్వారా మీరు మంచిగా సంపాదించుకోవచ్చు.

దీనికోసం రోజంతా శ్రమించక్కర్లేదు. రోజుకి రెండు మూడు గంటలు కష్టపడితే సరిపోతుంది. మీరు మిల్క్ వెండర్స్, పేపర్ బాయ్స్ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుని ఉదయంవేళ ఈ మొలకలని అందించొచ్చు. ప్రతిరోజూ ఇలా అందిస్తే స్థిరమైన ఆదాయం వస్తుంది.

రోటి తయారు చేయడం:

రాత్రిపూట అన్నానికి బదులుగా చాలామంది చపాతీ, జొన్న రొట్టెలని తింటారు అయితే మీరు ఈ బిజినెస్ ని మొదలు పెట్టి బాగా సంపాదించవచ్చు లైవ్ గా చపాతీలు కాల్చి మీరు ఇస్తే వ్యాపారం బాగా రన్ అవుతోంది. లేదా మీరు ఇంట్లో తయారు చేసి సప్లై చేయొచ్చు ఇలా గృహిణులు కూడా మంచిగా సంపాదించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news