తెలంగాణ వైద్య శాఖ వార్నింగ్.. కేసుల పెరుగుదల థర్డ్ వేవ్ కు సంకేతం… వచ్చే నాలుగు వారాలు కీలకం

-

ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో తెలంగాణ వైద్య శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఓమిక్రాన్ చాలా వేగంగా వ్యాపిస్తుందని తెలంగాణ డీహెచ్ శ్రీనివాస రావు అన్నారు. తెలంగాణలో గత రెండు రోజులుగా కేసులు పెరుగుతున్నాయని.. కేసులు పెరుగుదల థర్డ్ వేవ్ కు సంకేతమని డీహెచ్ హెచ్చరించారు. వచ్చే నాలుగు వాారాలు చాలా కీలకం అని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచానా వేశారు. న్యూ ఇయర్, సంక్రాతి పండగ వస్తున్న క్రమంలో వచ్చే 2-4 వారాలు చాలా కీలం అని అన్నారు. డెల్టా వేరియంట్ కన్నా ఆరు రెట్లు వేగంగా ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుందని అన్నారు. థర్డ్ వేవ్ కు కొన్ని వారాలే సమయం ఉన్నట్లు తాము భావిస్తున్నామని అన్నారు. అయితే థర్డ్ వేవ్ ను కరోనాకు ఎండ్ గా చూడచ్చని.. మరో 6 నెలల్లో కరోనా కనుమరుగు కావచ్చని ఆయన అన్నారు. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. లక్షణాలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు భౌతిక దూరం పాటించడంతో పాటు, మాస్కులను ఖచ్చితంగా వాడాలని ప్రజలకు శ్రీనివాస రావు సూచించారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news