అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ దెబ్బతో సోమవారం రోజున బ్లడ్ బాత్ చూసిన భారతీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు పుంజుకున్నాయి. సుంకాలతో షాక్ ఇచ్చిన ట్రంప్ మనసు మార్చుకుని ప్రపంచ దేశాలతో చర్చలకు రెడీ అన్న సంకేతాలతో మార్కెట్లు ఇవాళ కుదుటపడ్డాయి. ఆరంభంలోనే లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 1600 పాయింట్లతో లాభాలను చూసింది. ఇక నిఫ్టీ కూడా 22,600 ఎగువకు చేరింది.
ఉదయం 74,013.73 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 74,859.39 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకి.. చివరికి 1089.18 పాయింట్ల లాభంతో 74,227.08 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 374.25 పాయింట్ల లాభంతో 22,535.85 వద్ద ఫిక్స్ అయింది. సెన్సెక్స్ 30 సూచీలో పవర్ గ్రిడ్ మినహా మిగిలిన అన్ని షేర్లూ లాభాల్లో ముగిశాయి. టైటాన్, బజాజ్ ఫైనాన్స్, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు.. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ 100, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్సులు కూడా 2 శాతం మేర లాభాలతో ముగిశాయి.