ఇలా చేస్తే ఇంట్లో ఉంటే డబ్బులు సంపాదించచ్చు…!

-

మీరు ప్రొఫెషనల్ ట్యూటర్ అవ్వాలని అనుకుంటున్నారా..? అయితే తప్పకుండా దీనిని పూర్తిగా చూడండి. ఇక్కడ ప్రొఫెషనల్ ట్యూటర్ కి సంబంధించి వివరాలను పొంద పరచడం జరిగింది. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా చూసేయండి.

 

రిక్వైర్మెంట్స్ ని తెలుసుకోండి:

ముందుగా మీరు దీని కోసం ప్లాన్ చేసుకోవాలి. ఎటువంటి టాపిక్స్ మీద మీరు కవర్ చేయాలనుకుంటున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. ఎటువంటి వాళ్లకి ట్యూటరింగ్ చేయాలి..?, ఇతరులు కంటే మీరు విభిన్నంగా ఏం చేయాలనుకుంటున్నారు..?, ఇప్పుడు ఉండే మార్కెట్లో పోటీ ని మీరు ఎలా ఎదుర్కోవాలి అనుకుంటున్నారు..? ఇటువంటి వాటిపై మీకు కాస్త అవగాహన ఉండాలి. పైగా మీకు సబ్జెక్టు పరంగా జ్ఞానం ఎక్కువగా ఉండాలి. అలాగే మీకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.

మీ ఆడియన్స్ ని తెలుసుకోండి :

దీనికోసం మీరు ఎవరికి ట్యూషన్ చెప్పాలి..?, ఏ వయసు వాళ్ళకి చెప్పాలి..?, ఏ సబ్జెక్టు పరంగా చెప్పాలి..? అనేది కూడా తెలుసుకోవాలి.

మీ టాపిక్ ని ఎంచుకోండి :

మీకు ఉండే నైపుణ్యం, మీరు చదివిన చదువుకు ఆధారంగా మీరు ఏ సబ్జెక్ట్ చెప్పాలి అనేది నిర్ణయించుకోవాలి. అలాగే పవర్ పాయింట్ లో స్లైడ్స్ తయారు చేయడం లేదా ఇంటరాక్టివ్ ఆక్టివిటీస్ లాంటివి చేయడం వంటివి చేయాలి. అప్పుడే విద్యార్థులు ఫోకస్డ్ గా చదువుకోవడానికి వీలవుతుంది.

విద్యార్థుల్ని ఎలా ఆకర్షించాలి..?

ఎప్పుడైతే విద్యార్థులు మీ పాఠాన్ని ఇష్టపడతారో అప్పుడే మీ వద్ద ఎక్కువ మంది విద్యార్థులు వస్తూ ఉంటారు. విద్యార్థుల్ని మీరు ఆకర్షించాలంటే…

సబ్జెక్ట్ పరంగా క్లియర్గా టెక్స్ట్ మరియు వీడియో మెసేజ్ లు తయారు చేసుకోండి.

రివ్యూ, రేటింగ్ మరియు ఫీడ్ బ్యాక్ ని ఇంప్రూవ్ చేసుకోండి.

అడిగిన వెంటనే స్పందించండి. వాళ్ళకి సహాయం చేసే విధంగా మీరు చూడండి.

ట్యూటరింగ్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి..?

యూట్యూబ్ ద్వారా మీరు డబ్బులు సంపాదించాలి అనుకుంటే వివిధ వెబ్ సైట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. MyPrivateTutor.com, BharatTutors.com, tutorindia.net లాంటి సైట్లు ఉన్నాయి. మీరు అక్కడ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని మీ డీటెయిల్స్ ని అక్కడ పొందుపరిస్తే చాలా అవకాశాలు వస్తూ ఉంటాయి. పైగా దీని ద్వారా మీరు బాగా సంపాదించవచ్చు కూడా.

Read more RELATED
Recommended to you

Latest news