కాంగ్రెస్ ఎమ్మెల్యేల పంచాయతీ ఢిల్లీకి చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో ఉన్న దీపాదాస్ మున్షి దగ్గరకు చేరిందట ఎమ్మెల్యేల వ్యవహారం. దీంతో వెంటనే.. రహస్యంగా సమావేశం అయిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసారట దీపాదాస్ మున్షి. ఇక ఈ నెల 5న తెలంగాణకు వస్తానని దీపాదాస్ మున్షి ప్రకటించారట.
నేనొచ్చే వరకు ఎక్కడ ఈ అంశంపై మాట్లాడొద్దంటూ ఎమ్మెల్యేలకు ఆదేశించారట దీపాదాస్ మున్షి. ఐటీసీ కోహినూర్లో భేటీ తర్వాత ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఎక్కడా మాట్లాడొద్దంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు ఇచ్చారని అంటున్నారు. పీసీసీ చీఫ్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. దీంతో… కాంగ్రెస్ ఎమ్మెల్యేల పంచాయతీ ఢిల్లీకి చేరినట్లు వార్తలు వస్తున్నాయి.