బిజినెస్ ఐడియా: వాటర్ బాటిల్ బిజినెస్ తో మంచిగా లాభాలను పొందొచ్చు..!

మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా..? అయితే మీకోసం ఒక బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియాని కనుక ఫాలో అయ్యారంటే కచ్చితంగా మంచిగా డబ్బులు సంపాదించవచ్చు. పైగా ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. మరి ఇక ఆ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాలలోకి వెళ్ళిపోతే… ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

అందుకని మీరు వాటర్ ప్లాంట్ ని స్టార్ట్ చేస్తే బెస్ట్. మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కంపెనీల చట్టం ప్రకారం మీ కంపెనీ పేరు రిజిస్టర్ చేసుకోవాలి. దీనికోసం పాన్ కార్డు వంటివి అవసరం అవుతాయి. అదే విధంగా ఈ వ్యాపారం మొదలు పెట్టడానికి మీకు కొద్దిగా స్థలం కావాలి. 1000 నుంచి 1500 చదరపు అడుగుల స్థలం ఉంటే సరిపోతుంది.

దీనిలో మీరు బోర్ వేసుకోవాల్సి ఉంటుంది. RO, చిల్లర్ మిషన్ ఏర్పాటు చేసుకోవాలి. వాటర్ స్టోర్ చేయడానికి ట్యాంకులు ఏర్పాటు చేయాలి. మీరు ప్లాంట్ ప్రారంభించేటప్పుడు టీడీఎస్ లెవెల్ ఎక్కువ ఉండకుండా నీటిలో చూసుకోండి. చాలా కంపెనీలు కమర్షియల్ ఆర్ఓ ప్లాంట్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ప్లాంట్ ద్వారా 50 వేల రూపాయల నుండి రెండు లక్షల దాకా ఉంటుంది.

ఇది మీరు కొనుక్కోవచ్చు. 100 వాటర్ క్యాన్స్ ని కొనాలి. 20 లీటర్ల పట్టేవి అయితే బెస్ట్. అయితే ఈ వ్యాపారం మొదలు పెట్టడానికి నాలుగు నుండి ఐదు లక్షలు అవసరం. ముద్ర లోన్ కింద పది లక్షల వరకు లోన్ వస్తుంది. వెయ్యి లీటర్ల నీటిని ఉత్పత్తి చేస్తే యాభైవేల దాకా సంపాదించవచ్చు. ఏది ఏమైనా నెలకు రూ.లక్షకు పైగా సంపాదించవచ్చు నెలవారి ఖర్చులు పోగా రూ. 50000 దాకా లాభం ఉంటుంది.