కలబందతో లాభాలు.. రూ.50 వేలతో రూ.10 లక్షలు!

-

మీరు వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే మీకు ఓ అద్భుత అవకాశం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం సంపాదించే అవకాశం. మనం ప్రతి ఇళ్లలో పెంచుకునే కలబంద సాగుతో రూ.లక్షల్లో సంపాదించవచ్చు. అంటే అలో వెరాతో అద్భుతమైన లాభాలను పొందవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

సౌందర్య ఉత్పత్తులో అలొవెరాను విపరీతంగా వాడటం వల్ల మార్కెట్‌లో కలబందకు డిమాండ్‌ పెరిగింది. దీని వల్ల మంచి లాభాలు వస్తున్నాయి. హెర్బల్, మెడిసిన్, కాస్మొటిక్స్‌లో అలొవెరాను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అందువల్ల వీటిని తయారు చేసే కంపెనీలు కలబందను కొనుగోలు చేస్తుంటాయి.
చాలా వరకు కాంట్రాక్టు పద్ధతిలో కంపెనీలు కలబందను సాగు చేస్తాయి. వాణిజ్య పంట అయిన కలబందను పండిస్తే.. సంవత్సరానికి రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలు ఆర్జించవచ్చు. ఇలాంటి రాబడి ఉండటం వల్ల చదువుకున్న వారు చాలా మంది అలొవెరా పంటను సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.

ముఖ్యంగా ఈ అలొవెరా పండించాలని భావించే వారు ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. దీనికి అవసరమైన అంశాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సెంట్రల్‌ ఇ¯Œ స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడిసినల్‌ అండ్‌ ఏరోమ్యాటిక్‌ ప్లాంట్స్‌ ట్రైనింగ్‌ ఇస్తుంది. అలొవెరాను వేడి వాతావరణం ఉన్న ప్రాంతా ల్లో సైతం పండించవచ్చు.

ఒక హెక్టార్‌ అలొవెరా సాగు చేయడానికి రూ.28 వేలు ఖర్చు అవుతుందని ఇండియన్‌ కౌన్సెల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ తెలిపింది. ఈ సాగుకు కావాల్సిన ఇతర ఖర్చులతో సహా రూ.50 వేల వరకు కావాల్సి వస్తుంది. ఒక హెక్టార్‌లో 45 టన్నుల వరకు కలబంద ఆకులు లభిస్తాయి. ఒక్కో టన్నుకు రూ.15 వేల నుంచి రూ.25 వేల లాభాలు ఆర్జించవచ్చు .అంటే మీరు సంవత్సరానికి రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలు సంపాదించవచ్చు. వ్యాపారం చేయాలని భావించేవారికి అలొవెరా సాగు ఒక అద్భుతమైన అవకాశం.

Read more RELATED
Recommended to you

Exit mobile version