ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లకు రక్షణ కరువైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వాలు పేదల కోసం కట్టించి ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లను కూల్చిన హైడ్రా అధికారులు మంగళవారం ఉదయం కూల్చివేశారు.
ఈ ఘటన హైదరాబాద్ పరిధిలోని నిజాంపేట్ ఇందిరమ్మ కాలనీ ఫేజ్2 కాలనీలో చోటుచేసుకుంది. పేదల ఇండ్లు రోడ్లపై ఉన్నాయంటూ హైడ్రా అధికారులు ఇండ్లను కూల్చుతున్నట్లు సమాచారం. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా తాము ఇదే ఇండ్లల్లో ఉంటున్నామని, కొత్తగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తమ ఇండ్లను కూల్చడం ఏంటని బాధిత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.