బిజినెస్ ఐడియా: ఆ పంటతో రైతులకు డబ్బులే డబ్బులు..ఎకరానికి లక్ష లాభం..

-

ఈరోజుల్లో వ్యవసాయం చేసేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది..అంతే కాదు కొత్త కొత్త పంటలను కూడా పండిస్తున్నారు.అందులో ఇప్పుడు కంద పంట రైతులకు కాసుల వర్షాన్ని కురిపిస్తుంది..ఈ ఏడాది దిగుబడి కూడా మెరుగ్గా ఉండడంతో కంద రైతుల ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం మార్కెట్‌లో పుట్టు కంద ధర రూ.4000 పలుకుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఎకరానికి 70 నుంచి 80 పుట్టుల వరకూ కంద ఊరుతోంది. 232 కిలోలను పుట్టుగా వ్యవహరిస్తారు. ఎకరం కంద చేను తవ్వితే 70 నుంచి 80 పుట్టులు దిగుబడి వస్తోంది.దాంతో రైతులకు ఎకరానికి రూ.70 వేల నుంచి రూ. లక్ష వరకూ మిగులుతోంది..

 

రైతులు పుట్టు విత్తనాన్ని రూ.3000 నుంచి రూ. 3400 రేటుకు కొనుగోలు చేశారు. ఇప్పుడు మార్కెట్‌లో పుట్టు ధర రూ.4000 ఉండడానికి తోడు ఊరికలు బాగా రావడం రైతులకు కలసి వస్తోంది. ప్రస్తుత మార్కెట్‌లో లభిస్తున్న ధర ప్రకారం 80 పుట్టులకు రూ.3.20 లక్షలు, 70 పుట్టుల ఊరిక ఉంటే రూ.2.80 లక్షల ఆదాయం వస్తోంది.

ఎకరానికి ఖర్చు రూ.2.10 లక్షలు అయ్యిందని రైతులు చెబుతున్నారు..ఎకరం విస్తీర్ణంలో కంద వేయాలంటే విత్తనానికి రూ.1.02 లక్షలు, దుక్కి దున్నడానికి, కంద నాటడానికి, బోదెలు తవ్వడానికి, చచ్చు ఎక్క వేయడానికి కూలీలకు రూ.50 వేలు అవుతుంది. అలాగే పెంట వేయడానికి రూ.18 వేలు, ఎరువులు, పురుగు మందులకు రూ, 25 వేలు, నీటి తడులు, కలుపుతీతకు రూ.15 వేలు ఖర్చవుతుంది. మొత్తం ఖర్చు రూ.2.10 లక్షలు అవుతుండగా,మార్కెట్ ప్రకారం 70 అయితే,లక్షకు పైగా ఆదాయం వస్తుందని చెబుతున్నారు..

ఉభయ గోదావరి జిలాల్లో పండించిన కందకు మద్రాస్, ముంబై వంటి మార్కెట్‌లలో మంచి డిమాండ్‌ ఉంది.అందుకే రేటు బాగుంది. అంతే కాకుండా అన్ని జిల్లాల్లో కంద ఊరికలు గతంలో కంటే బాగా ఎక్కువగా వస్తున్నాయి…ఇప్పుడు ఈ పంటకు ఎక్కువ డిమాండ్ పెరగడం తో ఎక్కువ మంది రైతులు ఈ పంట వైపు మొగ్గు చూపుతున్నారు.ఈ పంట ప్రతి నేలలో పండుతుంది.దాంతో ఈ పంట వేసుకోవడం మేలు..ముందుగా వ్యవసాయ నిపునుల సలహాలను పాటించడం మంచిది..

Read more RELATED
Recommended to you

Exit mobile version