కేవలం రూ. 10 వేలు పెట్టుబడితో ఈ వ్యాపారం మొదలుపెట్టొచ్చు..!

-

సొంతగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా.. మీ దగ్గర కేవలం 10వేలు ఉన్నా ఈ బిజినెస్‌ చేయొచ్చు. అదే క్యాటరింగ్.. క్యాటరింగ్‌ అని తీసి పారేయకండి. మీరు కానీ కాస్త పట్టణ ప్రాంతాల్లో ఉంటే..ఈవెంట్స్‌ వచ్చినప్పుడు క్యాటరింగ్‌, రానిరోజు నాలుగు కర్రీస్‌ చేసుకుని కర్రీపాయింట్‌ పెట్టినా అస్సలు నష్టం లేకుండా రన్‌ అవుతుంది బిజినెస్..ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరూ చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా క్యాటరింగ్‌కు ఇవ్వడానికే ఆసక్తి చూపుతున్నారు. అలాంటప్పుడు దీనిని బిజినెస్‌గా ఎంచుకుంటే మంచి లాభాలు ఆర్జించవచ్చు. కేవలం 10 వేల రూపాయలతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

ఇంత తక్కువ ఖర్చుతో ఉద్యోగం కోసం బదులుగా మీ సొంత వ్యాపారం చేయడం చాలా సులభం. ఈ వ్యాపారం ద్వారా నెలకు 25-50 వేల రూపాయలు సంపాదించవచ్చు. కానీ వ్యాపారం పెరుగుతున్నా కొద్దీ.. మీరు కనీసం 1 లక్ష రూపాయల వరకు లాభం పొందవచ్చు.

ఎలా ప్రారంభించాలి?

మీరు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా కేటరింగ్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. దీని కోసం మీరు రేషన్‌, ప్యాకేజింగ్‌లో మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. క్వాలిటీ, టేస్ట్‌ మెయింటేన్‌ చేస్తే చాలు.. ఆటోమెటిక్‌గా మన బిజినెస్‌ క్లిక్‌ అవుతుంది. కొత్తలో ఇంకా రుచిగా చేయాలి. కల్తీ సరుకులు లాంటివి అస్సలు వాడొద్దు..

ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించడానికి, నిర్వహించడానికి, మార్కెట్ గురించి పరిజ్ఞానం కలిగి ఉండడం చాలా ముఖ్యం. క్యాటరింగ్ వ్యాపారం దీనికి మినహాయింపు కాదు. మీరు ఈ వ్యాపారంలోకి వెళ్లాలనుకుంటే, మీ సర్వీస్ గురించి ఆన్‌లైన్‌లో స్నేహితుల ద్వారా ప్రచారం చేయండి. క్రమంగా మీకు ఆర్డర్లు రావడం ప్రారంభమవుతుంది.

ఖర్చు ఎంత అవుతుంది?

క్యాటరింగ్ వ్యాపారం ప్రారంభించడానికి మీ వద్ద కనీసం రూ. 10,000 ఉండాలి. ఇందులో మీకు పాత్రలు, గ్యాస్ సిలిండర్ మొదలైన వస్తువులు అవసరం. శ్రమ కూడా అవసరం అవుతుంది. ఫ్రెండ్స్‌ కానీ కుటుంబసభ్యులు కానీ కలిసి చేస్తే బయట నుంచి తక్కువ మందిని పెట్టుకోవచ్చు. ఇంకా మనోళ్లు అయితే కలివిడిగా పనిచేస్తారు.

లాభం ఎంత .?

ఈ వ్యాపారంలో లాభం విషయానికి వస్తే.. మీరు ప్రారంభ దశలో రూ. 25,000 వరకు సంపాదించవచ్చు. మీ వ్యాపారం ప్రమోట్ చేస్తే.. పెద్ద పార్టీలలో మీ క్యాటరింగ్ సర్వీస్‌కు డిమాండ్ వస్తుంది. లాభం పెరగడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మీరు ఈ వ్యాపారంలో నుంచి ప్రతి నెలా కనీసం 1 లక్ష రూపాయల లాభం పొందవచ్చు. మీ వ్యాపారం మంచిగా మారితే లాభాలు మరింతగా పెరగవచ్చు.

మీరే చూసి ఉంటారు.. అక్షరం ముక్క రాదు.. ఇప్పుడు క్యాటరింగ్‌ బిజినెస్‌లో లక్షలు సంపాదించి..నాలుగు బిల్డింగ్‌లు కట్టాడు అని.. ఇందులోనే మీరు సక్సస్‌ అవ్వాలి అనుకుంటే.. కష్టపడైనా..సరే మీ బిజినెస్‌ క్లిక్‌ అయ్యేవరకూ పొరడండి..! ఒక్కసారి జనాలకు మన వంట రుచి తెలిసి మళ్లీ మళ్లీ వచ్చారంటే..అప్పుడు ఆరామ్‌సే ఆర్డర్లు వస్తాయి. అయితే ఇది అనుకున్నంత సులవేం కాదు. కానీ అసాధ్యం అయితే కాదుగా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version