ఆర్ ఆర్ ఆర్‌, ఆచార్య సినిమా షూటింగులు వాయిదా

ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎప్పుడెప్పుడా అని తెలుగు రాష్ట్రాలు ఎంత‌గానో ఎదురుచూస్తున్నాయి. అలాంటి సినిమాను క‌రోనా ఆపేసింది. అవునండి మీరు విన్న‌ది నిజ‌మే. తాజాగా ఈ సినిమా షూటింగును నిలిపివేస్తున్న‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇందుకు కార‌ణం రామ్‌చ‌ర‌ణ్ షూటింగ్ కు నిరాక‌రించ‌డ‌మే.

ఇప్ప‌టికే నాగ‌చైత‌న్య థాంక్యూ, స‌ర్కారువారి పాట‌, గోపీచంద్ మూవీలు షూటింగ్‌ను నిలిపివేస్తున్న‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించాయి. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్‌, ఆచార్య ఇదే బాట‌లోకి వ‌స్తున్నాయి. తాత్కాళికంగా ఈ సినిమా షూటింగులు నిలిపివేస్తున్న‌ట్టు స‌మాచారం. రామ్ చ‌ర‌ణ్ ఇంత‌కుముందు ఆచార్య సోనూసూద్ ని క‌లిశారు. అయితే రామ్ చ‌ర‌ణ్ క‌లిసిన త‌ర్వాత సోనూసూద్ కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో రామ్ చ‌ర‌ణ్ క్వారంటైన్ లోకి వెళ్లి పోయారు. ఈ నేప‌థ్యంలో ఆచార్య షూటింగును కొద్ది రోజుల పాటు వాయిదా వేసింది చిత్ర బృందం. క‌రోనా విజృంభ‌న నేప‌థ్యంలో వాయిదా వేశామ‌ని, త్వ‌ర‌లోనే తిరిగి ప్రారంభిస్తామ‌ని తెలిపారు చిత్ర పెద్ద‌లు.
రామ‌చ‌ర‌ణ్ క్వారంటైన్ కార‌ణంగా రెండు పెద్ద సినిమాలు ఆగిపోయాయి. అయితే త్వ‌ర‌లోనే ఆయ‌న షూటింగులో పాల్గొంటార‌ని చ‌ర‌ణ్ స‌న్నిహితులు తెలుపుతున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు క‌రోనా సోకి, చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పుడు చ‌ర‌ణ్ కూడా అదే బాట‌లోకి వ‌స్తారా అని అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కాగా ఆయ‌న‌కు క‌రోనా సోక‌లేద‌ని, కేవ‌లం క్వారంటైన్ లో ఉన్నార‌ని చిత్ర‌బృందం తెలుపుతోంది. చూడాలి మ‌రి చ‌ర‌ణ్ ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతారో.