రాధేశ్యామ్‌లో పూజా హెగ్దే పాత్ర అలా ఉంటుందా! వెరీ ఇంట్రెస్టింగ్‌..

-

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ నేష‌న‌ల్ స్టార్ అయిపోయాడు. ప్ర‌తి సినిమాను ప్యాన్ ఇండియా లెవెల్‌లోనే తీస్తున్నాడు. ఇక సాహో త‌ర్వాత ప్ర‌భాస్‌, పూజా హెగ్డే కాంబినేషన్ లో జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ లాస్ట్ షెడ్యూల్ ఇట‌లీలో షూటింగ్ జరుగుతుంద‌ట‌. పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కుతున్న సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.


ఈ సినిమాలో ప్రభాస్ పూజా హెగ్డే విక్రమాదిత్య, ప్రేరణ పాత్రల్లో ఒదిగిపోనున్నారు.
ఇక ఇప్పటికే విడుదలైన మూవీఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు పెంచేసింది. ఇక తాజాగా ఈ సినిమాఉ సంబంధించిన ఓ వార్త ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చెక్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ పెద్ద కార్ల కంపెనీకి ఓనర్ గా కనిపించనుండగా, పూజా హెగ్డే మెడికల్ స్టూడెంట్ గా వారి పాత్ర‌లు ఉంటాయ‌ని తెలుస్తోంది.
ఒక ప్రమాదం వల్ల సినిమాలో హీరో, హీరోయిన్ కలుస్తారని.. ఇక అక్క‌డి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుందంట‌. ఇక భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండ‌గా.. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండవని.. మొత్తం ఫీల్ గుడ్ ల‌వ్‌స్టోరీ అని తెలుస్తోంది. మరోవైపు రాధే శ్యామ్ సినిమా రిలీజ్ వాయిదా ప‌డే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. ఈ స‌మాచారం విన్న రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానులు నిరాశ ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. దాదాపు రూ.250 కోట్లతో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. మ‌రి మిగ‌తా సినిమాల్లాగే ఈ మూవీని కూడా వాయిదా వేస్తారా లేదా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version