ఇండియాకు పంపిస్తారని భయంతో తెలుగు విద్యార్థి ఆత్మహత్య..

-

అమెరికాలో ఉంటున్న ఓ తెలుగు విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం అక్కడి భారతీయులను డిపోర్టేషన్ భయం వెంటాడుతోంది.డాలర్ డ్రీమ్స్‌తో అమెరికాకు కొందరు అక్రమార్గాన వెళ్లడం, మరికొందరు సక్రమంగా వెళ్లినా వీసా గడువు ముగియడం వంటి కారణాలతో ఇండియన్స్ బెంబేలెత్తిపోతున్నారు.

ఈ క్రమంలోనే ఉన్నత చదువుల కోసం న్యూయార్క్ వెళ్ళిన సాయికుమార్ రెడ్డి అనే తెలుగు విద్యార్థి చదువు పూర్తయ్యాక.. ఉద్యోగం వేటలో అమెరికాలోనే ఉంటూ పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు.ట్రంప్ ఆదేశాలతో ప్రస్తుతం అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయులను వారి దేశాలకు తిప్పి పంపించేస్తున్నారు. ఈ క్రమంలోనే సాయికుమార్ పనిచేసే చోట తనిఖీలు జరిపిన అధికారులు, విద్యార్థిగా గడువు ముగిసినా భారత్ వెళ్లకుండా అమెరికాలో నివాసం ఉంటున్నట్టు గుర్తించారు.దీంతో అతని పాస్‌‌పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు. తనను ఎక్కడ ఇండియాకు పంపిస్తారోనని భయపడిన సాయికుమార్ పనిచేసే చోటనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version