8 Vasantalu Trailer: “8 వసంతాలు” సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్ చూసిన వారందరూ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో అనంతిక, సునీల్ కుమార్ ప్రధాన పాత్రలలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన 8 వసంతాలు సినిమా జూన్ 20వ తేదీన రిలీజ్ కానుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించారు.

కాగా, మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఈ ట్రైలర్ లో వచ్చిన డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మగాడి ప్రేమకు సాక్షాలుగా పాలరాతి సౌధాలు, భాగ్యనగరాలు ఉన్నాయి. కానీ ఆడదాని ప్రేమకు ఏముంది మనసులోనే సమాధి చేసుకున్న జ్ఞాపకాలు తప్ప అనే డైలాగ్స్ చాలా ఉన్నాయి. ఈ డైలాగ్స్ విని సినీ అభిమానులు ఎంతగానో ఫిదా అవుతున్నారు. సినిమా చాలా బాగుంటుందని ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.