జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్.. భార్య ఫిలింఛాంబర్ కి ఫిర్యాదు

-

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్  జూనియర్ లేడీ కొరియోగ్రాఫర్ పై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి చంచల్ గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ చేపట్టేందుకు ఐదు రోజుల పాటు జానీ మాస్టర్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించగా.. కోర్టు నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం నార్సింగి పోలీస్ స్టేషన్ లోనే జానీ మాస్టర్ విచారణ కొనసాగుతోంది.

తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిర్యాదు చేసిన యువతి తన భర్త జానీ మాస్టర్ ని ట్రాప్ చేసిందని సుమలత పేర్కొంది. జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా,  పిల్లలు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో శనివారం ఉదయం ఫిర్యాదు చేశారు. చివరికీ ఆమె బాధ తట్టుకోలేక తాను కూడా ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించానని వెల్లడించింది. అత్యాచారం చేశాడని ఫిర్యాదు ఇచ్చిన అమ్మాయి, ఆమె తల్లి పెళ్లి చేసుకోవాలని తన భర్తను తీవ్ర ఒత్తిడికి గురి చేశారని తెలిపింది. ఆ కక్షతోనే తన భర్త పై అక్రమ కేసు పెట్టారని సుమలత వాపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version