దానిపైన మోజుతో ఏకంగా భర్తకే దూరం అయిన ప్రముఖ నటి..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపున సొంతం చేసుకున్న ప్రమోదిని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఏ పాత్ర ఇచ్చినా సరే పరకాయ ప్రవేశం చేసి మరీ నటిస్తూ ఉంటుంది. ఇటీవల శ్రీ విష్ణు , రెబా మౌనిక జంటగా నటించిన సామజవరగమన సినిమాలో హీరోకి తల్లి పాత్రలో తనదైన నటనలో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం సామజవరగమన ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రమోదిని తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. ఎన్నో విషయాలను వెల్లడించారు.

ప్రమోదిని మాట్లాడుతూ.. సినిమాల పైన ఇష్టంతో అమెరికాలో ఉన్న నా భర్తను కూడా వదిలేసి వచ్చాను.. మా కాలంలో నోకియా పెద్ద మొబైల్ ఉండేది. అప్పుడు అవుట్ గోయింగ్, ఇన్ కమింగ్ కి కూడా చార్జీలు ఉండేవని ప్రమోదిని తెలిపారు. మేము మొత్తం నలుగురమని ఆమె కామెంట్ చేశారు. ఇకపోతే పెళ్లి అయిన వెంటనే అమెరికాకు వెళ్ళిపోయాను. ఒక పాప కూడా జన్మించింది. నా కూతురు ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. చిన్నప్పటినుంచి నేను సినిమాలు చేస్తున్నాను. అప్పుడు అనుకోలేదు పెళ్లి తర్వాత నచ్చిన ప్రొఫెషన్ మిస్ చేసుకుంటున్నాను అనిపించింది.

అమెరికా అబ్బాయిని ఎందుకు చేసుకున్నానని అనిపించింది అంటూ ప్రమోదిని తెలిపింది. ఏం చేసినా నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు నా భర్త చదివిస్తానని చెప్పినా నాకు ఆసక్తి లేదు. అప్పుడు సోషల్ మీడియా లేదు, రీల్స్ లేవు.. నా భర్త హోమ్ థియేటర్ ఆర్కిటెక్ట్ గా పనిచేసేవారు. వెళ్ళిపోవాలని అనుకుంటున్నానని భర్తకు చెప్పి ఒప్పించి పాపను తీసుకుని ఇండియాకి వచ్చేసాను. ఇక భర్త కూడా నీ ఇష్టమే నా ఇష్టం అంటూ చెప్పారు. ఇండస్ట్రీలో ఉండే ఫ్రెండ్స్ కి కూడా నేను సినిమాల కోసం ఇండియాకి వచ్చేసానని చెప్పగానే నాకు అవకాశాలు ఇచ్చారు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version