నేడు భద్రాచలానికి భట్టి విక్రమార్క..వరద ప్రాంతాల్లో పర్యటన

-

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేడు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. భద్రాచలంలో పర్యటించి నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించనున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

నీటిమట్టం 54.30 అడుగులకు చేరుకుంది. 14,92,708 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు… 5 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో కొద్ది రోజులుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రెండో రోజు క్షేత్రస్థాయి పరిస్థితుల పై ఆరా తీశారు.

శుక్రవారం వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాల పై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మాట్లాడి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకున్నారు. పలు ముంపు, వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టేలా అధికార యంత్రాంగానికి సలహాలు, సూచనలిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version