మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన త్వరలో ఒక తల్లితండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. పెళ్లైన పదేళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చగా తమ కెరియర్ లో ఉన్నత స్థానానికి చేరుకున్న తర్వాతే పిల్లలను కనాలని తాము ముందే డిసైడ్ అయినట్లు ఇటీవల ఉపాసన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. మొత్తానికైతే ఉపాసన ప్రెగ్నెన్సీ వార్తతో అటు మెగా ఫ్యామిలీ, ఇటు మెగా అభిమానులలో ఆనందం నెలుకొనిందని చెప్పవచ్చు. మరికొద్ది రోజుల్లో ఉపాసన బిడ్డకు జన్మనివ్వనుండగా తాజాగా ఒక ఊయల ఆమెకు బహుమతిగా అందజేయబడింది.
దీనిని ప్రజ్వల ఫౌండేషన్ కి చెందిన మహిళలు స్వయంగా తయారు చేయడం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పవచ్చు. అయితే అందుకు సంబంధిత వీడియోని కూడా ఉపాసన ఇన్ స్టా లో షేర్ చేసింది. వారి నుంచి ఈ గిఫ్ట్ పొందడం చాలా గర్వంగా ఉందని కూడా పోస్ట్ పెట్టింది ఉపాసన.. అద్భుతమైన మహిళల నుంచి ఈ హృదయపూర్వక బహుమతిని అందుకోవడం చాలా గర్వంగా ఉంది.
వాళ్లు స్వయంగా తమ చేతులతో తయారుచేసిన ఈ అపారమైన ప్రాముఖ్యత కలిగిన ఊయల ధైర్యం, బలం, ఆశకు ప్రతీకగా గుర్తుండిపోతుంది. ఇది ధైర్యవంతులైన మహిళల పరివర్తన, ఆత్మగౌరవ ప్రయాణాన్ని సూచిస్తుండగా పుట్టినప్పటినుంచి ఇలాంటి విషయాల పట్ల నా బిడ్డకు అవగాహన పెంపొందాలని నేను మరింత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అంటూ ఒక ఎమోషనల్ నోట్ ను వీడియోతో పాటు జత చేసింది ఉపాసన. ఇకపోతే సి ఎస్ ఆర్ అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈమె యు ఆర్ లైఫ్ ఫౌండర్ అని కూడా అందరికీ తెలిసిందే. సోషల్ యాక్టివిటీస్ లో చాలా యాక్టివ్ గా పాల్గొనే ఈమె ఇందుకోసం పలు స్వచ్ఛంద సంస్థలతో కూడా కలిసి పనిచేస్తుంది. ఒక ప్రస్తుతం ప్రజల ఫౌండేషన్తో పాటు సునీత కృష్ణన్ కి కూడా ఉపాసన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.
View this post on Instagram