సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన ఆ ఒక్కటీ అడక్కు.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

-

టాలీవుడ్ నటుడు అల్లరి నరేశ్ ఇటీవల సీరియస్ క్యారెక్టర్లు ఉన్న చిత్రాలే చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయనలో మంచి కామెడీ యాక్టర్ ఉన్న విషయం తెలిసిందే. ఆ యాంగిల్ను చాలా రోజులుగా ప్రేక్షుకులు మిస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేశ్ ఫుల్ ఆన్ కామెడీ ఎంటర్టైనర్తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ చిత్రమే ఆ ఒక్కటీ అడక్కు.

‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రంతో మల్లి అంకం దర్శకుడిగా పరిచయమయ్యారు. పెళ్లికాని యువకుడి స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లో నవ్వులు పంచింది. ఇప్పుడీ కామెడీ ఎంటర్‌టైనర్‌ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో.. జెమీ లివర్, వెన్నెల కిషోర్, రితూ చౌదరి, అరియానా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్ను ఈ సినిమా చూస్తూ జాలీగా గడిపేయండి.

Read more RELATED
Recommended to you

Latest news