‘తీస్ మార్ ఖాన్’ ట్రైలర్ రిలీజ్.. రూత్ లెస్ పోలీస్ గా ఆది అదుర్స్

-

ఆది సాయి కుమార్ లేటెస్ట్ మూవీ తీస్ మార్ ఖాన్. విడుదలకు సిద్దమైన ఈ మూవీ ట్రైలర్ నేడు విడుదల చేశారు. యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ కలగలిపి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీస్ మార్ ఖాన్ తెరకెక్కి నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

హిట్ కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నం చేస్తున్నాడు ఆది సాయి కుమార్. ఆది డెబ్యూ మూవీ ప్రేమ కావాలి మాత్రమే ఆయన కెరీర్ లో హిట్ నమోదు చేసింది. మొదటి సినిమాతోనే క్రేజ్ తెచ్చుకుని ఆది ఆ టెంపో కొనసాగించలేకపోయాడు. వరుసగా ఫ్లాప్స్ ఇస్తున్నా.. ఆదికి అవకాశాలు రావడం గమనార్హం. కామెడీ, థ్రిల్లర్, హార్రర్, రొమాన్స్ అన్ని రకాల జోనర్స్ ట్రై చేసిన ఆది.. ఈసారి పవర్ ఫుల్ కాప్ గా ప్రేక్షకులను అలరించనున్నారు.

ఆగస్టు 19న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ను చిత్రబృందం నేడు విడుదల చేసింది. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది సాయికుమార్ రుత్ లెస్ పోలీసు అధికారిగా ఆది కనిపిస్తున్నాడు. ఈసారైనా ఆది ఖాతాలో హిట్ చేరనుందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news