అమీర్ సూచ‌న‌తోనే ఆ సినిమాలో న‌టించా : నాగ చైత‌న్య

-

కొద్ది రోజుల నుంచి అక్కినేని హీరో నాగ చైత‌న్య.. సినిమాల స్పీడ్ పెంచాడు. క‌థ‌కు ఇంప్రెస్ అయితే.. వెంట‌నే న‌టించ‌డానికి అంగీక‌రిస్తున్నాడు. లవ్ స్టోరీ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకున్న నాగ్ తో బంగార్రాజ్ సినిమా చేశాడు. ఈ సినిమా కూడా ప‌ర్వ‌లేద‌న్న‌ట్టు న‌డిచింది. దీని త‌ర్వాత నాగ్ చైత‌న్య థాంక్యూ అనే సినిమా ను ప్ర‌క‌టించాడు. రాశి ఖ‌న్నా హీరోయిన్ గా విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు దిల్ రాజ్ నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

అయితే బాలీవుడ్ లో హీరో అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చ‌ద్దా అనే సినిమాలో ఒక కీల‌క పాత్ర‌లో నాగ చైత‌న్య న‌టించాడు. కాగ ఈ సినిమా ఫారెస్ట్ గంప్ అనే ఇంగ్లీంష్ సినిమాకు రీమేక్. కాగ ఈ సినిమా క‌రోనా కార‌ణంగా విడుద‌ల వాయిదా ప‌డింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 14 న విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం సిద్దం అయింది.

కాగ ఈ సినిమా గురించి మీడియా ప్ర‌తినిధులుతో నాగా చైత‌న్య పంచుకున్నాడు. త‌న‌కు ఫారెస్ట్ గంప్ అంటే చాలా ఇష్ట‌మ‌ని అన్నారు. చాలా సార్లూ చూశాన‌ని చెప్పారు. అయితే ఇదే సినిమా రీమేక్ లో నటిస్తాన‌ని అనుకోలేద‌ని అన్నారు. కాగ త‌న‌ను అమీర్ ఖాన్ ఈ సినిమాలో చేయాల‌ని సూచించాడ‌ని అన్నారు. దీంతో తాను వెంట‌నే అంగీకరించాన‌ని అన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version