డైరక్టర్ సురేందర్ రెడ్డి కి షూటింగ్ లో గాయాలు .!

-

హీరో అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “ఏజెంట్”. ఈ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తోంది ఈ సినిమా కోసం సురేందర్ రెడ్డి చాలా కష్టపడుతూ ఉన్నారు. ఈ సినిమా పర్ఫెక్షన్ కోసం కొన్ని రీ షూట్స్ కూడా చేస్తున్నట్టు గతంలోనే వార్తలు వచ్చాయి.

అయితే ఈ సినిమా  యాక్షన్ ఎపిసోడ్స్ సీన్స్ కోసం షూటింగ్ సందర్భంగా దర్శకుడు సురేందర్ రెడ్డి కి గాయాలు అయినట్లు తెలుస్తోంది. తాజాగా వచ్చిన ఫొటో ప్రకారం తన కాలికి గాయమైంది. సురేందర్ రెడ్డి రెస్ట్ తీసుకోకుండా కాలికి కట్టు వేసుకొని , వీల్ చైర్ లో కూర్చుని మరీ పని చేస్తున్నారు. ఈ ఫొటో చూసి ఆయన అభిమానులు ఆయన కమిట్ మెంట్ ను మెచ్చుకుంటున్నారు.

ఇక ఈ సినిమా ను ముందు పిబ్రవరి లో రిలీజ్ చేయాలని చూశారు. కాని సాదారణంగా పెద్ద హీరోల తెలుగు సినిమాలు ఫిబ్రవరి మరియు మార్చి లో విడుదల చేయటానికి ఆసక్తి చూపరు. ఆ రెండు నెలలు  పరీక్షలు ముందు వస్తాయి కాబట్టి అందుకే పెద్ద సినిమాలు ఆ రెండు నెలల్లో విడుదల  కావు. అది పెద్ద రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అని మళ్లీ వేసవి కాలంలో రిలీజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version