మన్మథుడు ఫేమ్, హీరోయిన్ అన్షు గురించి టాలీవుడ్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన చేసిన వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. మజాకా సినిమా ఈవెంట్ లో ఆయన మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై సినిమా ప్రియులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మజాకా అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కు సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా ఏళ్ల తరువాత అన్షు మళ్లీ నటిస్తున్నారు. ఆమె కొంచెం సన్నబడింది. అందుకే తిని పెంచమ్మా. తెలుగుకి ఇది సరిపోదు.. అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ప్రముఖ హీరోయిన్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తగదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను బ్యాన్ చేయాలి అని కామెంట్స్ పెడుతున్నారు.