ఢిల్లీ మాజీ ఎంపీ రమేష్ బిధూడీ ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన ప్రియాంక గాంధీ, సీఎం అతిషి పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రమేష్ బిధూడి పై మాజీ సీఎం కేజ్రీవాల్ నిన్న సెటైర్ వేశారు. ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ వ్యాఖ్యలపై రమేష్ తాజాగా స్పందించారు. సీఎం రేసులో తాను లేనని క్లారిటీ ఇచ్చారు.
“బీజేపీ పట్ల ఎంత విశ్వాసంగా ఉంటానో.. ప్రజల పట్ల అంతే ఉంటాను. నేను సీఎం అభ్యర్థి అంటూ ప్రచారం చేస్తున్నారు. అవి వాస్తవాలు కాదు. పార్టీ అన్ని వేళలా నాకు అండగా ఉంది. నాపై విశ్వాసంతో ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించింది. అదుకే రెండుసార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. మరోసారి మీకు సేవ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ప్రజల సేవకుడిగా పని చేస్తూనే ఉంటా” అని మీడియా సమావేశంలో పేర్కొన్నారు రమేష్ బిధూడి.