పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీపై పలు వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలపై తాజాగా కోలీవుడ్ నటుడు నాజర్ స్పందించారు.
కోలీవుడ్ సినిమాల్లో కేవలం తమిళ నటీనటులనే తీసుకోవాలని ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా కొత్త నియమాలు తీసుకుందంటూ.. తమిళ చిత్ర పరిశ్రమ అందరికీ అవకాశాలు కల్పించాలని, పవన్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడారు. ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా ఇలాంటి రూల్స్ ప్రవేశపెట్టలేదని స్పష్టం చేశారు. కోలీవుడ్‌ను ఉద్దేశించి ప్రస్తుతం చక్కర్లు కొడుతోన్న వార్తల్లో ఎలాంటి నిజంలేదని అన్నారు. ఒకవేళ కోలీవుడ్‌లో అలాంటి నియమాలు వస్తే.. వ్యతిరేకించే వారిలో ముందు నేనుంటానని తెలిపారు. ఇప్పుడు అంతటా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోందని.. వివిధ ప్రాంతాలకు చెందిన నటీనటులు, టెక్నీషియన్స్ కలిస్తేనే మంచి సినిమాలు రూపొందించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు నాజర్.