గత రెండు రోజులుగా టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. విశ్వక్ సేన్ నటిస్తున్న లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వి మాట్లాడుతూ లైలా సినిమాలో తన పాత్ర గురించి చెప్పాడు. ఆ చిత్రంలో సత్యం అనే పాత్రలో నటించినట్లు.. ఆ సినిమాలో తనకి మొదట 150 మేకలు ఉంటే, సినిమా ఎండింగ్ లో 11 మేకలు మాత్రమే మిగిలాయని వైసీపీని కించపరిచేలా మాట్లాడాడంటూ వైసీపీ అభిమానులు ఆయనని సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశారు.
దీంతో లైలా మూవీని బాయ్ కట్ చేయాలని పోస్టులు చేశారు. ఆ తర్వాత ఈ పోస్టులపై స్పందించిన పృథ్వీరాజ్.. బూతులతో రెచ్చిపోయాడు. ఒక నటుడిగా సినిమా ఫంక్షన్ వేదికపై మాట్లాడిన మాటలను వైసీపీ సోషల్ మీడియా టార్గెట్ చేసిందని అన్నాడు. ఆ మాటలు తను ఎవరిని ఉద్దేశించి అనలేదని, అక్కడికి వచ్చిన ప్రేక్షకులను నవ్వించడానికి అలా మాట్లాడానని తెలిపాడు. అయితే రెండు రోజులుగా తనను సోషల్ మీడియాలో తీవ్రంగా వేధిస్తున్నారని, ఈ వేధింపుల కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యానని తెలిపాడు.
అనంతరం ఓ వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. ఇక తాజాగా ఈ వివాదంపై మరోసారి స్పందిస్తూ.. ” వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ద్వేషం లేదు. నావల్ల సినిమా దెబ్బ తినకూడదు. అందుకే అందరికీ క్షమాపణలు చెబుతున్నాను. బాయ్ కాట్ లైలా అనకుండా.. వెల్కమ్ లైలా అనండి. లైలా సినిమా పెద్ద హిట్ కావాలి” అన్నారు పృథ్వి.