ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పారు. ‘రాబిన్హుడ్’ ప్రీరిలీజ్ వేడుకలో వార్నర్ గురించి రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ పై మాజీ క్రికెటర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ చేశారు. ఈ నేపథ్యంలో నెటిజన్ల ఆగ్రహంతో దిగొచ్చిన రాజేంద్ర ప్రసాద్ తాజాగా వివరణ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. తన మాటల వల్ల ఎవరైనా బాధపడితే క్షమించమని కోరారు.
అసలేం జరిగిందంటే..
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్ హుడ్ ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ఈ మూవీలో కీలక పాత్రలో నటించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా హాజరయ్యాడు. అయితే వార్నర్ ను ఉద్దేశించి సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “రేయ్ డేవిడ్, వచ్చి క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్ప స్టెప్పులు వేస్తావా, దొంగ ము** కొడకా, నువ్వు మామూలోడివి కాదు రోయ్ వార్నరూ” అంటూ షాకింగ్ కామెంట్స్ చేయడంతో నెట్టింట రాజేంద్రప్రసాద్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో అనుభవం గల నటుడు స్టార్ క్రికెట్ పై ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని మండిపడ్డారు. ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు తాజాగా రాజేంద్రప్రసాద్ సోషల్ మీడియా వేదికగా వీడియో రిలీజ్ చేశారు.
ఒకరికి ఒకరం బాగా క్లోజ్.
మరెప్పుడూ ఇలా జరగదు.
ఉద్దేశ్యపూర్వకంగా అనలేదు.
అయినా కూడా సారీ- Rajendra Prasad#DavidWarner pic.twitter.com/44Io3J3gyy— Telugu360 (@Telugu360) March 25, 2025