సినిమా ఇండస్ట్రీలో మరో పెను విషాదం చోటు చేసుకుంది. కాంతార మూవీ నటుడు మృతి చెందాడు. రెండు సంవత్సరాల కిందట తక్కువ బడ్జెట్ తో కాంతార సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ సినిమాలో నటించిన టీ ప్రభాకర్ కళ్యాణి అనే నటుడు మృతి చెందారు. గుండెపోటుతో ఆయన కాసేపటికి క్రితమే మరణించినట్లు తెలుస్తోంది.

కర్ణాటక ఉడిపి జిల్లాలోని హిరియాడ్కా లోని తన నివాసంలో టీ ప్రభాకర్ కళ్యాణి గుండెపోటుతో మృతి చెందారు. కాంతార సినిమాలో మహాదేవ పాత్రలో ఆయన నటించిన సంగతి తెలిసిందే. ఐదు సంవత్సరాల కిందట ప్రభాకర్ కళ్యాణికి గుండె ఆపరేషన్ కూడా జరిగినట్లు చెబుతున్నారు. అంతేకాదు ప్రభాకర్కు భార్య అలాగే కుమారుడు ఉన్నారు. ఇండస్ట్రీలోకి రాకముందు కొన్ని నాటకాలు కూడా వేశారట. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి రాణిస్తున్నారు. ఇక ప్రభాకర్ కళ్యాణి మృతి నేపథ్యంలో ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు సంతాపం తెలుపుతున్నారు.