చిరంజీవి, బాలకృష్ణలను పెద్ద తప్పే.. అంటూ తమ్మారెడ్డి భరద్వాజ సంచలన కామెంట్స్ చేశారు. ఛాంబర్ ను విడిచి సమస్యల పరిష్కారానికి పెద్దల పేరుతో చిరంజీవి, బాలకృష్ణల వద్దకు వెళ్లడం నా దృష్టిలో తప్పే అన్నారు. ఫెడరేషన్ , నిర్మాతలు.. రెండు వైపుల తప్పులు ఉన్నాయి… స్టార్ట్ వేర్ స్థాయిలో సినీ కార్మికులకు జీతాలు ఇస్తున్నామని చెబుతున్న వారు ఖచ్చితమైన లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నెల జీతాలు ఇస్తున్నారా? రోజువారి వేతనం ఇస్తున్నారా? నిర్మాతలు చెప్పాలని పేర్కొన్నారు.

గతంలో 50 రోజులు కూడా షూటింగ్ లు ఆపిన సందర్భాలు ఉన్నాయి. అంత వరకు పరిస్థితి రాకుండా సామరస్య పరిష్కారం చేసుకోవాలి… అవసరం లేని మనుషులను పెంచుకుని బడ్జెట్ పెంచుకుంటున్నారన్నారు. నిజం గా నిర్మాతలు సినిమాకు పెడుతున్నది చాలా తక్కువ అన్నీ అదనపు ఖర్చులే… సినిమా ఫ్యాషన్ గా పోయి కమర్షియల్ అయిపోయిన తర్వాత ఇలాంటివి తప్పవు అని వెల్లడించారు తమ్మారెడ్డి భరద్వాజ. హీరోలకు ఇచ్చే రెమ్యూనేషన్ ను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు… పెద్ద హీరోలు లేకపోతే సినిమాలు ఆడవు అనే దానిలో నిజం లేదన్నారు.