తెలంగాణ వీధి వ్యాపారులకు కేంద్రం భరోసా – లక్షల రుణాలు మంజూరు!

-

దేశంలో కరోనా మహమ్మారి సమయంలో వ్యాపారం కోల్పోయిన వీధి వ్యాపారులను ఆదుకోవడానికి పిఎం స్వనిధి పథకం ప్రవేశపెట్టారు. వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం లక్షల రూపాయల రుణాలను మంజూరు చేసింది. పీఎం స్వనిధి పథకం వీధి వ్యాపారులకు అతి తక్కువ వడ్డీతో ఎలాంటి తాకట్టు లేకుండా రుణాలను అందిస్తుంది. ఇది వారి వ్యాపారానికి కొనసాగించడానికి లేదా కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఎంతో సహాయపడింది. పీఎంస్వనిధి కింద తెలంగాణలోనె కాక దేశవ్యాప్తంగా,ఎంతో మంది లబ్ధి పొందారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..

రుణాల వివరాలు: మొదటి రుణం 10,000 రూపాయల ను 6నుండి 12 నెలల్లో తిరిగి చెల్లించే విధంగా మంజూరు చేస్తారు. ఆ తరువాత రెండవ రుణం కింద 20 వేల రూపాయలను ఆరు నుండి 18 నెలల్లో తిరిగి చెల్లించే విధంగా మంజూరు చేస్తారు. మూడవ రుణం 50 వేల రూపాయలు 36 నెలల లో తిరిగి చెల్లించే పూచికత్తు మీద అందిస్తారు. సకాలంలో రుణం తిరిగి చెల్లిస్తే 7% వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. డిజిటల్ చెల్లింపులు UPI, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సంవత్సరానికి 12,000 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

అర్హతలు : పట్టణ ప్రాంతాల్లో వీధి వ్యాపారం చేసేవారు ఈ పథకానికి అర్హులు. ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ చేయబడి ఉండాలి. పట్టణ స్థానిక సంస్థల నుండి గుర్తింపు కార్డు సర్టిఫికెట్ ఉండాలి. ULB సర్వేలో గుర్తించబడిన వారు లేదా సర్వే తర్వాత వ్యాపారం ప్రారంభించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

Central Government Support for Telangana Street Vendors – Loans Sanctioned to Thousands!

తెలంగాణలో ఈ పథకం 2021 జనవరి వరకు హైదరాబాదులో58,996 దరఖాస్తులు స్వీకరించబడ్డాయి వీటిలో 31,250 రుణాలు అందించబడ్డాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కింద 2,992 పందికి పదివేల రూపాయలు రుణం మంజూరు చేయబడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలోఇప్పటివరకు పీఎం స్వనిది కింద 4 లక్షల వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేశారు. ఈ పథకం కోసం మొత్తం 1200 కోట్ల రూపాయల రుణం అందించారు.

దరఖాస్తు ప్రక్రియ: ఈ పథకం కింద ఆన్లైన్లోనూ, ఆఫ్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేవారు ఈ(pmsvanidhi.mohua.gov.in)వెబ్సైట్ ద్వారా, లేదా మొబైల్ యాప్ ని ఉపయోగించి దరఖాస్తు చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ క్యాప్చర్ కోడ్ నమోదు చేసి ఓటిపి ద్వారా ధృవీకరణ పూర్తి చేయవచ్చు. అవసరమైన వివరాలు, డాక్యుమెంట్లను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక ఆఫ్లైన్లో స్థానిక ULB  కార్యాలయం లేదా బ్యాంకింగ్ కరస్పాండెంట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఆధార్ కార్డు వెడ్డింగ్ సర్టిఫికెట్, లెటర్ ఆఫ్ రికమండేషన్ అవసరం.

వీధి వ్యాపారులకు ఈ పథకం ఎంతో ఉపయోగకరం బయట వడ్డీకి డబ్బులు తీసుకుంటే ఎంతో అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే ఈ పథకం ద్వారా అధిక వడ్డీ రేటును తగ్గించవచ్చు,ఈ పధకం కింద దాదాపు 39% రుణాలు మహిళ వ్యాపారులకు మంజూరు చేశారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం ద్వారా వ్యాపారులు ఆధునిక ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నారు. ఈ పథకం ద్వారా ఎంతోమంది తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ జీవనోపాధిని మెరుగుపరుచుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news